మొదట దేశం.. ఆ తర్వాతే కుటుంబం అని నిరూపించిన మహిళా అధికారి

ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీతల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని అన్నాడు ఓ మహా కవి.

కాని దేశం గురించి దేశ ప్రయోజనాల గురించి ఆలోచించడం తప్పు ఉదార స్వభావం తో ప్రపంచం గురించి ప్రపంచ ప్రయోజనాల గురించి ఆలోచించాలని మన మెదడులో విషాన్ని గుప్పిస్తూ వక్రీకరించిన చరిత్రతో నిజాలను మరుగున దాచి మన సంస్కృతి సంప్రదాయాలను నేటి తరానికి అందకుండా చేసిన వామపక్షాలు వాటి భావజాలాలు కలిగిన మీడియా సంస్థల సాక్షిగా దేశ భక్తి అంటే దేశాన్ని అవమానించడమేనని.

వారే మేధావులుగా గుర్తించబడతారని అనే ఆలోచన ధోరణి నిజాలు తెలుస్తుండడంతో ఇప్పుడిప్పుడే మారుతుంది.

దీన్ని జీర్ణించుకోలేని వారు ఎన్ని కుట్రలు చేస్తున్నా ఫలితం ఉండట్లేదు.ఇక వివరాలలోకి వెళ్తే తాజాగా తన దేశభక్తిని ఓ మహిళా అధికారి చాటుకుంది.

ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అదేంటో ఇప్పుడు చూద్దాం.

తండ్రి మరణించిన విషయం తెలిసిన తమిళనాడుకు చెందిన ఏఆర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేశ్వరి స్వాతంత్య్రదినోత్సవ పరేడ్‌ను ముందుండి నడిపించడానికి తన విధులు నిర్వహించిడానికి ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

శనివారం దిండిగుల్‌ జిల్లా కలెక్టర్‌ శిల్పకు గౌరవవందనం చేసిన తర్వాతే ఆమె తన తండ్రి అంత్యక్రియలు నిర్వహించారు.

ప్రస్తుతం ఈ న్యూస్ చూసినవారంతా ఆమెకు సెల్యూట్ చేస్తున్నారు.

ప్రభుత్వానికి మద్దతుగా..  బొత్స అనుమానాస్పద వ్యాఖ్యలు