వేలిముద్రలా కనిపించే దీవి.. దాని విశేషాలు తెలిస్తే ఆశ్చర్యపోతారంతే!

ఈ భూప్రపంచంలో ఎన్నో వింత ప్రదేశాలు ఉన్నాయి.కొన్ని వింత ప్రదేశాలు మానవుల ఊహలకు మించిన రీతిలో అత్యద్భుతంగా ఉంటాయి.

సినిమాల్లో కనిపించే గ్రాఫిక్స్ లొకేషన్ల కంటే ప్రకృతిలో ఉండే సహజమైన లొకేషన్ లే అత్యంత అందంగా ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక ప్రదేశం అలాంటిదే.దీనిని వేలిముద్ర దీవిగా పిలుస్తారు.

ఎందుకంటే ఇది చూసేందుకు అచ్చం వేలిముద్ర లాగే కనిపిస్తుంది.దీని గురించి తెలిసిన వారంతా ఆశ్చర్యపోతుంటారు.

మరి వేలిముద్రలా కనిపించే ఈ దీవి విశేషాలు ఇప్పుడు తెలుసుకుందామా.యూరప్‌లోని క్రొయేషియాలో అడ్రియాటిక్ సముద్రంలో ఈ దీవి ఉంది.

ఆకాశం పైనుంచి చూస్తే ఇది అచ్చుగుద్దినట్టు వేలిముద్రలా కనిపిస్తుంది.అయితే ఈ ప్రదేశం మొత్తం ఒక వేలిముద్రలా కనిపిస్తే.

ఇందులో నిర్మించిన చిన్నచిన్న గోడలన్నీ కలిసి హస్త రేఖల్లా కనిపిస్తుంటాయి.మొత్తం మీద ఇది మానవుడి వేలిముద్రలా కనిపించి అందరినీ అబ్బుర పరుస్తుంటుంది.

ఈ దీవి చుట్టూ బ్లూకలర్‌ సముద్రం ఉంటుంది.కాకపోతే అక్కడ ఉండే గోడల వల్ల ఇది వైట్ కలర్‌లో కనిపిస్తుంది.

ఈ దీవికి బాల్జెనాక్ అనే పేరు కూడా ఉంది.కేవలం 0.

14 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉండే ఈ దీవిలో గోడలు మాత్రం 23 కి.

మీ పొడవు ఉన్నాయి.పొడవు ఎక్కువగా ఉన్నా.

గోడల ఎత్తు మాత్రం చాలా చిన్నగా ఉంటుంది.నిశితంగా పరిశీలిస్తే ఈ గోడ ఎత్తు మన నడుము కంటే ఎక్కువగా ఉండదు.

మరి ఇంత పొట్టిగా ఉండే గోడలను ఎందుకు నిర్మించారో ఇప్పటివరకు ఎవరూ తెలుసుకోలేకపోయారు.

"""/" / ఈ గోడలు సహజ సిద్ధమైనవి కావు.అయితే వీటిని గ్రహాంతర వాసులు నిర్మించి ఉంటారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

కానీ కొందరు మాత్రం అసలు ఏలియన్స్ అనేవి ఉన్నాయా? ఉంటే ఎక్కడున్నాయి? ఈ దీవిలో అత్యంత చిన్న గోడలు ఎందుకు నిర్మించారు? వాటి వల్ల లాభాలేంటి? అనే ప్రశ్నలు సంధిస్తున్నారు.

అయితే ఒకవేళ వీటిని మనుషులు నిర్మిస్తే.అంత చిన్నగా ఎందుకు నిర్మించారు? వాటి మధ్య అంత తక్కువ స్పేస్ ఎందుకు వదిలేశారు? అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ గోడలను ఎవరు నిర్మించారనే ఆధారాలు ఇప్పటి వరకు బయట పడలేదు.

పూర్వీకులు శత్రువుల నుంచి తప్పించుకునేందుకు ఇలాంటి చిన్న గోడల్లో దాచుకుని ఉండొచ్చని చరిత్రకారులు చెబుతున్నారు.

MP Raghuramakrishnaraju : నర్సాపురం నుండే పోటీ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు..!!