గత ప్రభుత్వ అవినీతిపై ఎంక్వైరీ చేయాలి:మాజీ గుమ్మడి
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల్లో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించాలని ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య అన్నారు.
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణంలో సిపిఐ(ఎంఎల్) ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలు జరిగాయని మండిపడ్డారు.
నేరేడుచర్ల పట్టణంలోని సర్వే నెంబర్ 243,244 ప్రభుత్వ భూమిలో నిరుపేదలు గతంలో గుడిసెలు వేస్తే, వాటిని ధ్వంసం చేసి, వారిపై కేసులు నమోదు చేసి,పేదలను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు.
నిత్యం పొట్టచేత పట్టుకొని పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్న నిరుపేదలందరికీ ప్రభుత్వం వెంటనే ఇండ్ల స్థలాలు,ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
నిరుపేదల కోసం ప్రజాపంథా పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తుందని తెలిపారు.ఈకార్యక్రమంలో ప్రజాపంథా పార్టీ రాష్ట్ర సెక్రెటరీ సభ్యులు గోపినపల్లి వెంకటేశ్వరరావు,జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్,పి.
యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్,డివిజన్ కన్వీనర్ వాసపల్లయ్య, సయ్యద్,కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
న్యాచురల్ గా షైనీ హెయిర్ ను పొందాలనుకుంటే ఇలా చేయండి!