ఏపీకి ఎన్నారై భారీ విరాళం..!!!

అమెరికాలో తెలుగు వారికి కొదవ లేదు.తమ అత్యున్నతమైన అభివృద్ధి కోసం ఎల్లలు దాటి వెళ్ళిన వారు ఇప్పుడు అమెరికాలో సంపన్నులుగా స్థిరపడి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.

సొంత ఊరి కోసం, సొంత జిల్లా కోసం, సొంత రాష్ట్రానికి ఏదన్నా చేయాలనే తపనతో తమవంతు సాయం అందిస్తున్నారు.

తాజాగా Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అమెరికాలో డాక్టర్ వృత్తిని చేస్తూ స్థిరపడిన ఓ తెలుగు ఎన్నారై సొంత రాష్ట్రంలో ఉండే పాఠశాలల్లో డిజిటల్ తరగతులని ఏర్పాటు చేయడానికి ఆయన భారీ విరాళాన్ని అందించారు.

కృష్ణా జిల్లా కలెక్టర్ కోరిక మేరకు స్పందించిన అమెరికాలో ఉన్న ప్రముఖ హార్ట్ సర్జన్ డా.

లక్కిరెడ్డి హనిమిరెడ్డి జిల్లాకు దాదాపు 50వేల డాలర్లను అంటే ఇండియన్ కరెన్సీలో “35 లక్షలు” విరాళంగా ఇచ్చారు.

ఇప్పటికి ఆయన అనేక సేవా కార్యక్రమాలకి గాను దాదాపు 60 కోట్ల రూపాయలని విరాళంగా ఇచ్చారు.

సొంత ఊరికోసం పుట్టిన భూమి కోసం ఇలా స్పందించడం ఎంతో అభినందించ తగ్గ విషయమని.

ఆయన్ని స్పూర్తిగా తీసుకుని మరింత మంది ముందుకు రావాలని కలెక్టర్ కోరారు.

ఓరి దేవుడో.. సైనిక విమానాల్లోనే వలసదారుల దేశ బహిష్కరణ.. ఒక్కో వ్యక్తికి లక్షల్లో ఖర్చు?