కొరియన్ స్టార్ హృదయంలో నిలిచిన భారతీయ అభిమాని.. దశాబ్దం తర్వాత గుర్తుపట్టాడు..?

ఒక దేశం సెలబ్రిటీల గురించి మరో దేశం వారికి తెలియకపోవచ్చు.అలాంటి సందర్భాల్లో ఆ సెలబ్రిటీలను గుర్తించకపోవడం, వారితో మాములు వ్యక్తిగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది.

పదేళ్ల క్రితం ఒక ఇండియన్ (Indian) ఓ కొరియన్ స్టార్ట్ (Korean Star)తో అలాగే ప్రవర్తించాడు అతను ఒక సెలబ్రిటీ అని తెలుసుకోలేకపోయాడు.

ఫొటో తీయమని అతడి వద్దకు వెళ్లి అడిగాడు, కొన్నేళ్ల తర్వాత మళ్లీ ఆ వరల్డ్ పాపులర్ స్టార్‌ని కలిసే అవకాశం దొరికింది.

EXO గ్రూప్‌లోని సూహో ఒక పాపులర్ కొరియన్ స్టార్.అతడి చేతనే ఈ ఇండియన్ గేట్ వే ఆఫ్ ఇండియా (Gateway Of India)దగ్గర ఫోటో తీయించాడు.

ఈ ఇండియన్ వ్యక్తి పేరు రోనాక్‌.ఇటీవల రోనాక్‌ ముంబైలో (Ronak ,Mumbai)జరిగిన ఒక ఈవెంట్‌కు వెళ్లాడు.

ఆ ఈవెంట్‌లో సూహో సింగింగ్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు.అతను అనేక మంది అభిమానుల మధ్య రోనాక్‌ను గుర్తించాడు.

వీళ్లిద్దరూ దాదాపు పది సంవత్సరాల క్రితం కలిశారు.ఆ సమయంలో రోనాక్‌కి సూహో(Suho) ఎవరో తెలియదు కాబట్టి సూహోని ఫొటో తీయమని అడగ్గా సూహో చాలా ఆశ్చర్యపోయాడు ఆ సమయంలో అతని గుర్తుపెట్టుకున్నాడు కూడా.

మళ్లీ పదేళ్ల తర్వాత అతన్ని గుర్తించి ఆ ఈవెంట్లో ఈ సంఘటన గురించి పంచుకున్నాడు.

"""/" / సోషల్ మీడియాలో వీరిద్దరికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్ అయింది.

ఈ వీడియోలో సూహో రోనాక్‌ను (Sooho, Ronak)చూసి, "అవును, నేను అతన్ని గుర్తుపెట్టుకున్నాను! అతను నన్ను ఫోటో తీయమని అడిగాడు" అని చాలా ఆనందంగా చెప్పాడు.

ప్రేక్షకులు కూడా చప్పట్లు కొట్టి ఆయన్ని ప్రోత్సహించారు.కొరియా సంగీత ప్రపంచంలో చాలా ఫేమస్ అయిన సూహో, తను భారతదేశానికి వచ్చినప్పుడు జరిగిన ఈ సంఘటనను ఇంకా మర్చిపోలేదు.

"""/" / ఇంతలో, రోనాక్ (ఇప్పుడు ఆయన డాక్టర్) ఈ అద్భుతమైన క్షణాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు.

సూహో స్టేజ్ మీద తనని గుర్తుపట్టిన వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేశాడు.ఆయన "సూహో, నేను మళ్లీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది.

తొమ్మిది సంవత్సరాల తర్వాత మేం మళ్లీ కలుసుకున్నాం! భారతదేశంలో ఆయన మొదటి కచేరీకి వెళ్లాను.

ఆశ్చర్యంగా, ఆయన నన్ను గుర్తుపట్టాడు.భారతదేశానికి గతంలో వచ్చినప్పుడు జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

ఇది మా ఇద్దరికీ మరచిపోలేని క్షణం." అని రాశాడు.

రోనాక్(Ronac) మాట్లాడుతూ "ఈసారి నేను ఆయన ఫోటోలు తీసి, ఆయన పాటలు పాడే వీడియోలు రికార్డ్ చేయడానికి వచ్చాను.

అక్కడ వాతావరణం చాలా బాగుంది, సూహో తన పాటలతో స్టేజీపై మంటలు పుట్టించాడు.

" అని తెలిపాడు.

కూతుర్ని పైలట్‌ను చేసిన తండ్రి.. ఆయన కూడా పైలటే.. ఆమె ఫ్లైట్‌లోనే రిటైర్డ్‌!