Harish: ఈవెంట్ మానేజర్ అవతారం ఎత్తిన ఒకప్పటి చాక్లెట్ బాయ్
TeluguStop.com
చాలా మంది సినిమా ఇండస్ట్రీలో స్టార్ డం ని అనుభవించాలని అనుకుంటారు.తాము నటించే సినిమాలతో మంచి పేరు సంపాదించుకొని వీలైనంత ఎక్కువ రోజులు ఇండస్ట్రీలో ఉండాలని కలలు కంటారు.
కానీ అది అందరికీ సాధ్యం కాదు అందులో ముందుగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మరియు ఒకప్పటి స్టార్ హీరో, చాక్లెట్ బాయ్ హరీష్ ( Chocolate Boy Harish )గురించి.
అతడు మొట్ట మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత హీరోగా అవతారం ఎత్తాడు.
మొన్నటి తరం హీరోలైన అక్కినేని, ఎన్టీఆర్, కృష్ణం రాజు, కృష్ణ, శోభన్ బాబు సినిమాల్లో ఎక్కువగా హరీష్ బాల నటుడిగా కనిపించేవాడు.
"""/" /
ఆ తర్వాత ప్రేమ ఖైదీ ( Prema Khidi )అనే సినిమాతో హీరోగా మారాడు.
ఇది తెలుగులో పెద్ద విజయం సాధించింది.అంతే కాదు తెలుగు లో కంటే హిందీలో బ్లాక్ బాస్టర్ హిట్టు కావడంతో హిందీ చిత్ర పరిశ్రమలో హరీష్ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
వాటితో పాటు సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషల్లోనూ తనదైన ముద్ర వేసుకొని హీరోగా అలరిస్తూ మరోవైపు పెద్ద హీరోల సినిమాల్లో సెకండ్ లీడ్ గా కూడా కనిపించాడు.
అయితే అతి చిన్న వయసులో వచ్చిన క్రేజ్ ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియని హరీష్ తక్కువ రోజుల్లోనే తెరమరుగు అయిపోవడం విశేషం.
"""/" /
మరీ ముఖ్యంగా అతని కెరియర్ పాడు కావడానికి కారణం కొన్ని అడల్ట్ సినిమాలో నటించడం కూడా ఒకటి.
అందుకే అతని కెరియర్ ట్రాక్ తప్పిపోయింది.పైగా తనకు మొదటి విజయం అందించిన తెలుగు సినిమా ఇండస్ట్రీని పట్టించుకోలేదు.
బాలీవుడ్( Bollywood ) పైన ఎక్కువగా ఫోకస్ పెట్టాడు.దాంతో రేస్ లో వెనక్కి వెళ్ళిపోయాడు ప్లానింగ్ సరిగ్గా చేసుకోకపోవడం సరైన గైడెన్స్ కూడా లేకపోవడంతో ఎంతో ఎత్తుకు ఎదగాల్సిన హీరో హరీష్ చిన్న హీరోల సరసన నటించే పరిస్థితి వచ్చింది.
ఇక ప్రస్తుతం ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టుకొని బాలీవుడ్ లో కొన్ని ఈవెంట్స్ కూడా చేస్తూ ముంబై లోనే సెటిల్ అయ్యాడు.
ఇతడికి సంగీత అనే భార్య ఉండగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.కెరియర్ మొత్తం మీద 280 సినిమాల్లో నటించాడు హరీష్.
శ్రీ తేజ్ ను పరామర్శించిన నటుడు జగపతిబాబు.. ఏమన్నారంటే?