ప్రమాద ఘంటికలు మోగిస్తున్న పర్యావరణం

మానవుడి స్వార్థం చివరికి మానవుని మనుగడకే ప్రమాదం తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది.హ్యూమన్ ఓవర్ నాన్-హ్యూమన్ పై చేస్తున్న స్వారి ప్రతిఫలమే పర్యావరణ వ్యవస్థను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ది వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ -2022 ప్రకారం 1970 నుంచి నేటి వరకూ సుమారు 69% శాతం వివిధ జంతుజాతులు అంతర్ధానం అయినట్లు తెలిపింది.

‌ దీనికంతటికీ కారణం మానవుని చేష్టలే.పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాసాలు నిర్మాణాలు, రోడ్లు విస్తరణ, రైల్వే లైన్ నిర్మాణం, పర్యాటకం అభివృద్ధి పేరుతో రకరకాల రిసార్ట్స్ నిర్మాణాలు, పారిశ్రామికీకరణ పేరుతో పలు ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించడానికి ఎన్నో వేల ఎకరాల అడవులను ధ్వంసం చేయడంతో అనేక రకాల జంతుజాలం, మొక్కలు, పక్షులు, సహాజ సౌందర్య ప్రాంతాలు కనుమరుగు అవుతున్నాయి.

మానవుని భవిష్యత్తు పెనుప్రమాదంలో పడేస్తున్నాయి.ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా శీతల దేశాలు కూడా అధిక ఉష్ణోగ్రతలతో సతమతం అవుతున్నాయి.

తాజాగా కెనడా, అమెరికా దేశాల్లో ప్రజలు ఈ బాధలు అనుభవించిన సంఘటనలు చూసాం.

అదేవిధంగా ఉత్తరాఖండ్ లో వరదలు, ఇటీవల కేరళ, తమిళనాడు, తెలంగాణా లో వరదలు, అకాల వర్షాలు చూస్తూనే ఉన్నాము.

ఇక, తరచూ వడివడిగా వాతావరణ మార్పులు జరుగుతున్నాయి.అప్పుడికి అప్పుడే కుంభవృష్టి వానలు, వరదలు.

కాలాలుతో నిమిత్తం లేకుండా ఎండలు, వర్షాలు ఇదీ నేటి ప్రపంచం లోని వాతావరణ పరిస్థితి.

దీనికంతటికీ కారణం మానవుని స్వార్థం కోసం, అభివృద్ధి పేరుతో స్రృష్టిస్తున్న పర్యావరణ విధ్వంసం.

ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి పేరుతో, ఆధిపత్యం కోసం పర్యావరణ వ్యవస్థను ప్రమాదంలో పడేస్తున్నాయి.

తరచూ వివిధ దేశాల మధ్య ఘర్షణలు తాజాగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ దాడులు అనేక చోట్ల బాంబుల వర్షం, తుపాకీ కాల్పులు, క్షిపణులు ప్రయోగం, దాడులు, పండుగలు పేర బాణాసంచా కాల్చుట, పంట పొలాల్లో మిగులు చెరకును కాల్చుట, విద్యుత్ ఉత్పత్తిలో బొగ్గు వాడుట, వివిధ ప్లాస్టిక్ వ్యర్ధాలను కాల్చడం, వాహన వినియోగం, ఎలక్ట్రానిక్స్ పరికరాలు వాడుట ద్వారా ఉత్పత్తి అయ్యే రేడియేషన్, ఆహార పదార్థాలు వ్రుధా ఇటువంటి అంశాలు అన్నియు మొత్తం పర్యావరణాన్ని సర్వ నాశనం చేస్తూ, భవిష్యత్తులో మానవుని, సమస్త జంతుజాలం మనుగడనే ఈ భూమి మీద లేకుండా చేస్తున్నారు.

ఇప్పటికే అనేక మంది, వివిధ రోగాలతో దాదాపు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రులు చుట్టూ తిరుగుతూ సమయాన్ని, ఆదాయాన్ని, డబ్బును ఖర్చు పెడుతున్న వైనం చూస్తూనే ఉన్నాము.

అయినప్పటికీ, సరిదిద్దే చర్యలు, పాటించవలసిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండుంట దేనికి సంకేతం.? పౌర సమాజమా మేలుకో.

నాకెందుకులే అనే సంకుచిత భావాలకు స్వస్తి పలకండి.పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించాలి.

వేయి మైళ్ళ ప్రయాణం అయినా, ఒక అడుగుతో ప్రారంభం అవుతుంది అంటారు.అలాగే పర్యావరణ పరిరక్షణ కూడా ప్రతీ ఒక్కరూ నుంచి ప్రారంభం కావాలి.

"""/"/ బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో ఓటమికి కూడా ఒక కారణం అమెజాన్ అడవులు ధ్వంసం చేయడంలో ఈయన పాత్ర ఉందని భావించుటయే.

ప్రపంచంలో చాలా దేశాలు ఐ.పి.

సి.సి నిబంధనలు, ప్యారిస్ ఒప్పందం అముల్లో అలసత్వం వహిస్తున్నారు.

‌ కాప్ 26, ప్రస్తుతం జరుగుతున్న కాప్ 27 చేయి తీర్మానాలు పాటించాలి.

ఇప్పటికే భారత్ జీరో ఎమిషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తోంది.ఎలక్ట్రానిక్ వెహికల్ వినియోగం భారత్ లో పెరుగుతుంది.

గ్రీన్ టెక్, డిజిటల్ వైపు వేగంగా భారత్ ప్రయాణం చేస్తుంది.‌ సెప్టెంబర్ 17వ తేదీన నమీబియా నుంచి తెచ్చిన 8 చిరుత పులులను మధ్యప్రదేశ్ లోని "కునో" నేషనల్ పార్క్ లో విడుచుట ద్వారా తిరిగి భారత్ లో అంతరించి పోయిన చిరుతలను పునఃప్రారంభం కానున్నది.

‌ """/"/ శ్వేత జాతీయులు నల్ల జాతీయులపై, భారత్ లో అగ్రకులాల వారు అణగారిన వర్గాల ప్రజలపై ఎలా దాడి చేస్తూ తప్పులు చేస్తున్నారో.

అదేవిధంగా మానవుడు పర్యావరణ పరిరక్షణలో, జీవవైవిధ్యం కాపాడుటలో కీలక పాత్ర పోషిస్తున్న జంతువులు, పక్షులు, మొక్కలు పై దాడులు చేయిట అంత అమానుషమైన అంశంగా చూడాలి.

‌ ఈ భూమి మీద మనుషులు అందరూ ఎలా జీవించే హక్కు ఉందో, జంతువుల పక్షులు మొక్కలు కూడా అదే హక్కు ఉంది అనే అంశాన్ని మరువరాదు.

లేనిపక్షంలో పక్రృతి ప్రకోపానికి మానవుడు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.కొండలు, గుట్టలు, అడవులు నరికివేత ఆపాలి.

‌ ప్రక్రృతి వనరులు దోపిడీకి చెక్ పెట్టండి.‌ ప్రభుత్వాలు పర్యావరణ, అటవీ, వైల్డ్ లైఫ్ చట్టాలు పగడ్బిందిగా అమలు చేయాలి.

‌ ముఖ్యంగా గత 50 సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ వేదికలు, చట్టాలు, పర్యావరణ వేత్తలు సూచనలు చాలా దేశాలు పెడచెవిన పెట్టారు.

‌ అందుకే నేడు అనేక దేశాలు వివిధ రకాల ఉపద్రవాలు ఎదుర్కొంటున్నాయి.‌ మానవులు కూడా ఈ ప్రక్రృతిలో , పర్యావరణ వ్యవస్థలో ఎకోసిస్టంలో అంతర్భాగం అని మరువరాదు.

జీవవైవిధ్యం కాపాడుటలోనే, పర్యావరణ పరిరక్షణ ద్వారానే ప్రపంచ మానవుని మనుగడ, పురోగతి ఉంటుంది అని అందరూ గ్రహించుట, ఆచరించుట ద్వారానే మరికొన్ని సంవత్సరాలు ఈ మానవాళి మనుగడ సాగిస్తుందంని అందరూ గ్రహించాలి.

ప్రత్యేక హోదా : నితీష్ కుమార్ నిప్పు రాజేశారుగా ? బాబు ఏం చేస్తారో ?