జేసీబీకి ధన్యవాదాలు తెలిపిన ఏనుగు.. వైరల్ అవుతున్న వీడియో

ఆపదలో ఉన్నప్పుడు శత్రువుకి కూడా సాయం చేయాలనేది పెద్దలు చెప్పే మాట.కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుడు, శత్రువు అనే తేడా చూడకూడదు.

కష్టాల్లో ఉన్నప్పుడు మనకు తోచినంత సాయం చేయాలి.చేతనైతే సాయం చేయాలి.

అందేకానీ ఆపదలో ఉన్నప్పుడు వాళ్ల వీక్ నెస్ ను వాడుకుని నష్టం చేయకూడదు.

ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా సాయం చేస్తే.వారికి ధన్యవాదులు చెబుతాం.

మనం మనుషులం కాబట్టి.నోటితోనే, ఎక్స్ ప్రెషన్స్ తోనే, మరో మార్గంలోనే ఏదో విధంగా థ్యాంక్స్ చెబుతాం.

కానీ మూగజీవాలు తమకు సాయం చేసిన వారికి ధన్యవాదాలు ఎలా చెబుతాయి అనుకుంటున్నారా.

అవును.ఈ ఏనుగు తనకు సాయం చేసివారికి ధన్యవాదాలు చెప్పింది.

తాజాగా ఓ ఏనుగు తనను కాపాడిన జేసీబీని హత్తుకుని ధన్యవాదాలు తెలిపింది.ఓ ఏనుగు పెద్ద గుంతలో పడిపోయి బయటకు వచ్చేందుకు కష్టపడుతూ ఉంది.

తీవ్రంగా శ్రమిస్తూనే ఉంది.అయితే పైకి రాలేకపోతుంది.

దీంతో స్థానికులు ఏనుగు కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయారు.జేసీబీతో సాయంతో ఏనుగులు బయటకు తీశారు.

ఏనుగు దొండం భాగంలో జేసీబీ లోడర్ బకెట్ ను ఉంచారు.అయినా ఏనుగు బయటకు రాలేకపోయింది.

దీంతో ఏనుడు నడుం భాగంలో జేసీబీ బకెన్ ను పెట్టారు.అప్పుడు దానిని సపోర్ట్ గా చేసుకుని ఏనుగు గుంతలో నుంచి బయటకు వచ్చింది.

గాబ్రియేల్ అనే వ్యక్తి దీనిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీనికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి.లక్షల లైక్స్ తో పాటు కామెంట్స్ వస్తున్నాయి.

దీనిని చూసి చాలామంది హ్యాట్పప్ చెబుతున్నారు.ఏనుగును కాపాడిన రిని ప్రశంసిస్తున్నారు.

సూపర్ హీరో రోల్ లో బాలయ్య.. ఆ మూవీతో బాక్సాఫీస్ ను షేక్ చేయనున్నారా?