వైరల్: చేపల పులుసుని ప్లాస్టిక్ కవర్‌లో వండేసిన వైనం… అదెలాగంటే?
TeluguStop.com
సాధారణంగా వంటల్ని పాత్రలు అయినటువంటి మట్టి కుండలో లేదంటే నేడు మార్కెట్ ని ఏలుతున్న సత్తు గిన్నెలనో వాడుతూ వుంటారు.
అయితే ఇక్కడ మట్టి కుండలు అనే మాట ఇపుడు లేదనుకోండి.దాదాపుగా అందరూ సత్తు పాత్రలనే వాడుతున్నారు.
ఇక విషయంలోకి వెళితే, ఒక పెద్దావిడ వాటికి విరుద్ధంగా ఒక ప్లాస్టిక్ కవర్‌లో ఏకంగా చేపల పులుసుని సునాయాసంగా వండేయడం వైరల్ వీడియోలో చూడవచ్చు.
కాగా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. """/" /
అవును, కట్టెల మంట సహాయంతో ప్లాస్టిక్ కవర్‌లో ఆమె వండిన తీరుకి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ది ఫైజెజ్ ట్విట్టర్ ఖాతా వేదికగా ఈ వీడియోను షేర్ చేయగా ఇప్పటివరకూ 7 లక్షల మందిపైగా దానిని వీక్షించడం కొసమెరుపు.
ఈ వీడియోలో పెద్ద వయసు మహిళ కట్టెల మంటలపై నీటితో నిండిన ప్లాస్టిక్ బ్యాగ్‌ను మొదట ఉంచింది.
అయితే ఇక్కడ కాసేపటి మంట వేడికి ఆ బ్యాగ్ వెంటనే కరిగిపోతుందని మనకి అనుమానం రావచ్చు.
కానీ ఇక్కడ అలా జరగలేదు. """/" /
సదరు ప్లాస్టిక్ బ్యాగ్ ఆ భారీ మంటకు తట్టుకుని ఉండటం మనం ఈ వీడియోలో స్పష్టంగా చూడవచ్చు.
ఆపై నీటిలో ఆమె చేపల పులుసుకి అవసరమైన దినుసులు వేస్తూ మధ్యలో చేపని అందులో వేస్తుంది.
ఈ క్రమంలో మసాలా దినుసులు, ఎండు మిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ వంటివి వేయడం చూడవచ్చు.
కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు ప్రశ్నలు కామెంట్స్ రూపంలో వేస్తున్నారు.
ప్లాస్టిక్‌తో కుకింగ్ క్యాన్సర్ ముప్పు పెంచుతుందని కొంతమంది అంటుంటే, మంట తగిలితే ప్లాస్టిక్ కరిగిపోతుందని.
అసలు ఇది సాధ్యమా? అని మరికొందరు యూజర్లు అడుగుతున్నారు.నీళ్లు పూర్తిగా ఉన్న సమయంలో ప్లాస్టిక్ బ్యాగ్‌లు ఫైర్‌ను తట్టుకుంటాయని, అయితే క్యాన్సర్‌ను మాత్రం అందిస్తాయని మరో యూజర్ ఇక్కడ కామెంట్ చేయడం కొసమెరుపు.
క్రిస్మస్ స్టాకింగ్‌లో లాటరీ టికెట్.. ఒక్క రాత్రిలో కోటీశ్వరురాలైంది..!