30 ఏళ్లకే ముఖంపై ముడతలు పడ్డాయా? అయితే వెంటనే ఇలా చేయండి!
TeluguStop.com
అరవై, డభై ఏళ్లు వచ్చిన తర్వాత కండరాలు పటుత్వాన్ని కోల్పోవడం వల్ల చర్మంపై ముడతలు ఏర్పడటం సర్వసాధారణం.
కానీ ఇటీవల రోజుల్లో కొందరు చిన్నవయసులోనే ముడతల సమస్యను ఎదుర్కొంటున్నారు.ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, ఒత్తిడి, కంటి నిండా నిద్ర లేకపోవడం, ధూమపానం, మద్యపానం పలు రకాల మందులు వాడటం, కాలుష్యం తదితర కారణాల వల్ల ముప్పై ఏళ్లకే ముఖంపై ముడతలు పడుతుంటాయి.
ముడతలు వృద్ధాప్యానికి సంకేతం.అందుకే ముడతలను పోగొట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే వెంటనే ఇప్పుడు చెప్పబోయే రెమెడీని పాటించండి.
ఈ రెమెడీ సహజంగానే ముడతలను మాయం చేసి ముఖ చర్మాన్ని టైట్ గా, బ్రైట్ గా మారుస్తుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి. """/"/
ముందుగా ఒక బంగాళదుంపను తీసుకుని పీల్ తొలగించి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ ను తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్ వేసుకోవాలి.
అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు బంగాళదుంప జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి.
"""/"/
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక బాక్స్ లో నింపుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
రోజు నైట్ నిద్రించే ముందు ముఖానికి ఉన్న మేకప్ ని తొలగించి వాటర్ తో వాష్ చేసుకోవాలి.
ఆపై తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని కనీసం పదినిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.
ఆపై నిద్రించాలి.ఇలా ప్రతిరోజు కనుక చేస్తే ముడతలు క్రమంగా మాయమవుతాయి.
ముఖ చర్మం బిగుతుగా మరియు కాంతివంతంగా మారుతుంది.ఏమైనా మొండి మచ్చలు ఉన్నా సరే తగ్గుముఖం పడతాయి.
కాబట్టి చిన్న వయసులోనే ముడతల సమస్యతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
దేవర మూవీ సెన్సార్ టాక్.. బాక్సాఫీస్ వద్ద తారక్ రికార్డులు క్రియేట్ చేయనున్నాడా?