ఒక్క వాష్‌లో చుండ్రుని మాయం చేసే ఎఫెక్టివ్ రెమెడీ మీకోసం!
TeluguStop.com
ప్రస్తుత వర్షాకాలంలో విపరీతంగా వేధించే సమస్యల్లో చుండ్రు ఒకటి.వాతావరణంలో వచ్చే మార్పులు, వర్షాల్లో తరచూ తడవడం, తడి జుట్టును జడ వేసుకోవడం లేదా దువ్వడం, షాంపూను సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం తదితర కారణాల వల్ల చుండ్రు సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది.
దీని నుంచి బయట పడటం కోసం నానా తంటాలు పడుతుంటారు.తోచిన చిట్కాలన్నీ ప్రయత్నిస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా? అయితే ఇకపై చుండ్రుతో డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే ఒక్క వాష్ లోనే చుండ్రు మాయం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో.? ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక ఉల్లిపాయను తీసుకుని పొట్టు తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
అలాగే అంగుళం అల్లం ముక్కను కూడా తీసుకుని పై తొక్కను తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ నుంచి స్ట్రైనర్ సాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
"""/"/
ఈ జ్యూస్ లో హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేయాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని తల మొత్తానికి పట్టించి గంట లేదా గంటన్నర పాటు షవర్ క్యాప్ ధరించాలి.
అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా తల స్నానం చేయాలి.
ఇలా చేస్తే ఒక్క దెబ్బకే చుండ్రు దూరం అవుతుంది.శాశ్వతంగా చుండ్రు దరి దాపుల్లోకి రాకుండా ఉండాలి అంటే ఈ రెమెడీని వారంలో ఒకసారి పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
స్టార్ హీరో అక్కినేని నాగార్జున మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే.. ఏం జరిగిందంటే?