పొడిబారిన, చిట్లిన జుట్టును రిపేర్ చేసే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ మీకోసం!
TeluguStop.com
సాధారణంగా ఒక్కోసారి జుట్టు చాలా డ్రై గా మారిపోతుంది.ప్రస్తుత చలికాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది.
వాతావరణం లో వచ్చే మార్పులు, సరైన తేమ లేకపోవడం తదితర కారణాల వల్ల జుట్టు పొడిబారడమే కాకుండా చిట్లిపోతూ కూడా ఉంటుంది.
ఈ రెండు సమస్యలను ఎలా వదిలించుకోవాలో తెలియక తెగ మదన పడుతూ ఉంటారు.
అయితే పొడిబారిన మరియు చిట్లిన జుట్టును రిపేర్ చేయడానికి ఎఫెక్టివ్ హోమ్ రెమెడీ ఒకటి ఉంది.
అదేంటంటే ఇప్పుడు తెలుసుకుందాం. """/" /
ముందుగా కలబంద ఆకును( Aloe Vera Leaf ) తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో నాలుగు మందారం పువ్వులు( Hibiscus Flowers ), రెండు మందారం ఆకులు వేసుకోవాలి.
అలాగే కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, అర కప్పు ఫ్రెష్ కొబ్బరి పాలు( Coconut Milk ), రెండు టేబుల్ స్పూన్లు పెరుగు,( Curd ) వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని చాలా స్మూత్ గా అయ్యేవరకు గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
"""/" /
గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.
పొడిబారిన చిట్లిన జుట్టు తో బాధపడుతున్న వారికి ఈ హెయిర్ మాస్క్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
వారానికి ఒకసారి ఈ మాస్క్ ను ప్రయత్నించడం వల్ల డ్రై హెయిర్ అన్న మాటే అనరు.
మందారం ఆకులు, పువ్వులు, కొబ్బరి పాలు, కలబంద, పెరుగు ఇవన్నీ జుట్టులో తేమను లాక్ చేస్తాయి.
పొడిబారిన జుట్టును మళ్లీ స్మూత్ గా షైనీ గా మారుస్తాయి.అలాగే ఈ మాస్క్ జుట్టు రాలడాన్ని మరియు చిట్లడాన్ని అడ్డుకుంటుంది.
జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.ఆరోగ్యమైన కురులను మీ సొంతం చేస్తుంది.
మహేశ్ బాబు మూవీ కోసం ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!