భిన్నత్వంలో ఏకత్వం అని చాటిన ఆటో డ్రైవర్-గత 8సంవత్సరాలుగా స్వాములకు భిక్ష ఏర్పాటు

రాజన్న సిరిసిల్ల జిల్లా: లౌకికవాదం, మతసామరస్య( Secularism ) పరిరక్షణలో దేశానికే మన రాష్ట్రం ఆదర్శం.

మరీ ముఖ్యంగా పల్లెల్లో ముస్లింలు, హిందువులు అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉంటారు… ఎవరికి కష్టం వచ్చినా ఒకరికొకరు అండగా ఉంటారు.

హిందువుల పండుగల్లో ముస్లింలు ముస్లిం ప్రార్ధనల్లో హిందువులు పాల్గొంటారు హిందూ ముస్లిం భాయి భాయి అని మరోసారి రుజువు అయింది.

బుధవారం ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు గ్రామంలో వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ మహమ్మద్ సందాని హనుమాన్ మాలదారులకు భిక్ష ఏర్పాటు చేసి మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.

ఈ సందర్భంగా సందాని మాట్లాడుతూ సిరిసేడులో హిందూ ముస్లింలు సోదర భావంతో ఉంటామని హనుమాన్ మాలాదారులకు భిక్ష ఏర్పాటు చేయడం సంతృప్తిని ఇస్తుందన్నారు.

పేద కుటుంబానికి చెందిన వాడనైన గత ఎనిమిది సంవత్సరాలుగా హనుమాన్ మాల ధారణ స్వాములకు భిక్ష ఏర్పాటు చేస్తున్నానని ఆంజనేయ స్వామి ఆశీస్సులతో తన కుటుంబం చల్లగా ఉంటుందని ఆర్థికంగా ఎదుగుతూ ఆరోగ్యకరంగా ఉంటున్నామని తెలిపారు.

హనుమాన్ స్వాముల సమక్షంలో శ్రీ అపర్ణ సోమేశ్వర స్వామి ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు, భజనలు చేసి అనంతరం పాఠశాల మైదానంలో సుమారు 100 హనుమాన్ భక్తులకు 5రకాల వంటకాలు చేసి భిక్ష ఏర్పాటు చేశామని తాను స్వయంగా భక్తులకు భిక్ష వడ్డన చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు.

అనంతరం స్వాములతో తన పిల్లలతో కలిసి భిక్ష చేశారు.గత కొన్ని సంవత్సరాలుగా కులమతాలకు అతీతంగా హనుమాన్ భక్తులకు భీక్ష ను ఏర్పాటు చేస్తున్న ఆటోడ్రైవర్ మహమ్మద్ సందానిని గ్రామ ప్రజలు హనుమాన్ భక్తులు అభినందించారు.

వీడియో: పెంగ్విన్ లాంటి జపనీస్ రైస్ బాల్స్‌ ఎప్పుడైనా చూశారా..??