కొడలిపై కోపంతో మనవడిని చంపిన అత్త..పోలీసుల విచారణలో వెలుగులోకి..!
TeluguStop.com

ఓ కసాయి మహిళ తన కోడలిపై కోపంతో సొంత మనవడిని గొంతు కోసి హత్య చేసిన ఘటన కర్ణాటక( Karnataka ) లోని గదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది.


అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.


గదక్ జిల్లా( Gadag )లోని గజేంద్ర నగర్ తాలూకాలోని ఓ గ్రామంలో సరోజా గూలీ అనే మహిళ నివాసం ఉంటుంది.
ఈమె కోడలు నాగరత్న ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక మగ బిడ్డకు జన్మనిచ్చింది.
ఆ బిడ్డకు అద్విక్ అని పేరు పెట్టారు.నాగరత్న బిడ్డ పుట్టాక ఆరు నెలల పాటు పుట్టింట్లో ఉండి, మూడు నెలల క్రితం అత్తారింటికి వచ్చింది.
"""/" /
అయితే నాగరత్న చిన్న వయసులో బిడ్డకు జన్మనివ్వడం వల్ల కాస్త బలహీనంగా ఉంది.
నాగరత్న ఇంట్లో పనులు చేయకపోవడంతో ఇంట్లో పనులన్నీ అత్త సరోజా గూలీ చేయాల్సి రావడంతో కోడలిపై పగను పెంచుకుంది.
"""/" /
ఈ క్రమంలో ఈనెల 22వ తేదీన ఒక పని కోసం నాగరత్న బయటకు వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చాక ఇంట్లో బిడ్డ కనిపించలేదు.
అత్త సరోజా ను అయితే ఏమో తనకు తెలియదని చెప్పడంతో నాగరత్న స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాక.అత్త సరోజా గూలీ ప్రవర్తన, మాట తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది.
నాగరత్నకు కూడా తన అత్తపై అనుమానం ఉంది.దీంతో పోలీసులు ( Police )సరోజాను గట్టిగా విచారణ చేయగా అసలు నిజం చెప్పేసింది.
తన కోడలిపై ఉండే కోపంతో పసికందును గొంతు కోసి చంపేసి, అడవిలో పాతి పెట్టినట్లు పోలీసుల ఎదుట అంగీకరించింది.
పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.నెలల పసికందును ఇంట్లో వాళ్లే చంపడం వల్ల స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
వామ్మో మహీరా ఖాన్.. చాంద్ నవాబ్ వైరల్ వీడియోను దింపేసింది.. నెట్టింట నవ్వులే నవ్వులు!