కదిలే చెక్క బొమ్మలు తయారుచేసిన ఆర్టిస్ట్.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!

సోషల్ మీడియా( Social Media )లో చెత్త వీడియోలు మాత్రమే కాదు మంచి వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి.

ముఖ్యంగా ఒకరి ప్రతిభను మనకి చూపించే వీడియోలు ప్రత్యక్షమవుతూ ఎంతో ఆకట్టుకుంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఒక ఆర్టిస్ట్ కదిలే చెక్క బొమ్మలను తయారు చేశాడు.వాటిని చూస్తుంటే ఎవరైనా సరే చూడకుండా ఉండలేరు.

ఈ వీడియోను సైన్స్ గర్ల్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.ఈ ఆర్టిస్ట్ పేరు షీరాన్( Sheeran ) అని, అతను వుడెన్ టాయ్స్ తయారు చేస్తాడని క్యాప్షన్‌లో వెల్లడించింది.

"""/" / వైరల్‌ అవుతున్న వీడియోలో పరిగెత్తుతున్న గుర్రం, ఈత కొడుతున్న చేప, ఎగురుతున్న పక్షి, రెక్కలు ఉన్న పంది, ఇంకా రకరకాల యాక్టివిటీస్‌లో ఎంజాయ్ చేస్తున్న బొమ్మలను చూడవచ్చు.

ఇవన్నీ కూడా ప్రాణం వచ్చిన బొమ్మల వలే కదులుతూ ఉన్నాయి.కానీ వీటన్నిటిని చెక్కతోనే అతడు తయారు చేశాడు.

చూసేందుకు అవి చాలా పర్ఫెక్ట్ గా కనిపించాయి.వీటిని మొత్తం తయారు చేయడానికి, అలాగే కదిలేలాగా సెటప్ ఏర్పాటు చేయడానికి ఆర్టిస్టు చాలా కష్టపడినట్లు ఉన్నాడు.

సదరు ఆర్టిస్ట్ మరో బొమ్మని తయారు చేస్తూ వీడియోలోనే కనిపించాడు.సజీవంగా ఉన్న ఒక జంతు ప్రపంచం ఈ చెక్క బొమ్మలలో( Wooden Figures ) మనకి కనిపిస్తుంది.

ఒక హ్యాపీ యానిమల్ లైఫ్ అని చెప్పుకోవచ్చు.దానిని కళాత్మకంగా ఈ ఆర్టిస్ట్ చాలా అద్భుతంగా చూపించాడు.

"""/" / ఈ రోజుల్లో ఇలాంటి కళాకారులు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పుకోవచ్చు.

సోషల్ మీడియా పుణ్యమా అని ఈ వుడెన్ ఆర్టిస్టు పనితనం మనం చూడగలుగుతున్నాం.

ఇంకా ప్రపంచంలో ఇలాంటి అద్భుతమైన ఆర్టిస్టులు ఎందరున్నారో వారందరి మాస్టర్ పీస్ లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయితే చూసి బాగా ఎంజాయ్ చేయవచ్చు.

వైరల్ అవుతున్న వీడియోకు ఇప్పటికే 18 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి దీనిని మీరు కూడా చూసేయండి.

పెసలతో వారానికి మూడు సార్లు ఇలా చేశారంటే పింపుల్స్ మళ్లీ ఈ వంక కూడా చూడవు!