అంటార్కిటిక్ మహాసముద్రంలో ఏలియన్ లాంటి జీవి.. 20 చేతులతో ఎంత వికృతంగా ఉందంటే…!
TeluguStop.com
అంటార్కిటికా మహాసముద్రంలో కొత్త రకం సముద్ర జీవిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.స్ట్రాబెర్రీల వలె కనిపించే ఈ జీవికి 20 చేతులు ఉన్నాయి.
దీనిని "అంటార్కిటిక్ స్ట్రాబెర్రీ ఫెదర్ స్టార్"( Antarctic Strawberry Feather Star ) అని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు.
ఈ జీవి 8 అంగుళాల పొడవు ఉంటుంది.ఇది నీటిలో ఈదడానికి దాని పొడవాటి చేతులను ఉపయోగిస్తుంది.
ఇది సముద్రగర్భంలో ఏవైనా పట్టుకోవడానికి గోళ్లను ఉపయోగిస్తుంది.ఆ గోర్లు ఒక్కొక్కటి 8 అంగుళాల పొడవు ఉంటాయి.
చూసేందుకు ఇది ఒక గ్రహాంతర వాసిలా కనిపిస్తుంది. """/" /
పరిశోధకులు ఈ జీవికి ప్రోమాకోక్రినస్ ఫ్రాగారియస్( Promacocrinus Fragarius ) అని శాస్త్రీయ నామం పెట్టారు.
దక్షిణ మహాసముద్రం నుంచి నమూనాలను సేకరించడానికి వలలను ఉపయోగించడం ద్వారా వారు దానిని కనుగొన్నారు.
ఈ ఆవిష్కరణకు ముందు, ప్రోమాకోక్రినస్ కెర్గ్యులెన్సిస్( Promacocrinus Kergulensis ) అని పిలిచే అంటార్కిటిక్ ఫెదర్ స్టార్ జాతి శాస్త్రవేత్తల కంటపడింది.
"""/" /
అంటార్కిటిక్ స్ట్రాబెర్రీ ఫెదర్ స్టార్ జీవుల్లో సాధారణంగా 10 చేతులు ఉంటాయి, కానీ ఈ జీవికి 20 చేతులు ఉన్నాయి.
ఈ కొత్త దానితో కలిపి మొత్తం అంటార్కిటిక్‌లో 8 జాతుల ఫెదర్ స్టార్ ఉన్నాయని తెలిసింది.
ఇందులో నాలుగు కొత్తవి, కొన్ని చాలా ఏళ్ల క్రితం గుర్తించినవి ఉన్నాయి.అంటార్కిటిక్ స్ట్రాబెర్రీ ఫెదర్ స్టార్ ముద్ర గర్భాల్లో కనిపించడం చాలా వింత జీవులలో ఒకటిగా నిలుస్తోంది.
ఇది 215 నుంచి 3,840 అడుగుల లోతులో నివసించే లోతైన సముద్ర జీవి.
చాలా భయంకరంగా కనిపించే ఈ జీవి నెమ్మదిగా కదులుతుంది.పాచి, ఇతర చిన్న జీవులను తింటుంది.
జీవితంలో ఎక్కువ కాలం ఇది సముద్ర గర్భానికే పరిమితం అవుతుంది.
తన అద్భుతమైన యాక్టింగ్ తో అదరగొట్టిన మహేష్ బాబు కొడుకు.. ఏం జరిగిందంటే?