వైరల్ : శునక రాజుల కోసం స్పెషల్ ట్రైన్.. ఎక్కడంటే.?
TeluguStop.com
చాలామంది కుక్కలను తమ ఇళ్లల్లో పెంచుకుంటూ ఉంటారు.వాటికి ఒక ముద్దు పేరు పెట్టుకుని ఇంట్లో ఒకమనిషి లాగా దాని బాగోగులు చూసుకుంటూ అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఉంటారు.
కుక్కలు కూడా తమకు అన్నం పెట్టి అక్కున చేర్చుకున్న యజమానుల పట్ల చాలా విశ్వాసంగా ఉంటాయి.
కానీ కొంతమంది మాత్రం పెంచుకుంటున్న కుక్కలను పోషించే ఆర్ధిక స్తోమత లేక వాటిని తీసుకుని వచ్చి ఎక్కడో చోట వదిలేసి వెళ్లిపోతున్నారు.
పాపం ఇన్నాళ్లపాటు ఒక ఇంట్లో ఉండి, ఆ ఇంటి మనుషులకు అలవాటు అయిన ఆ కుక్కలు అర్ధాంతరంగా ఇలా ఎక్కోడో తెలియని చోట తిండి తిప్పలు లేకుండా కష్టాలు పడడం చూసిన ఒక వ్యక్తి వాటిని అక్కున చేర్చుకున్నాడు.
దాదాపు డజనుకు పైగానే కుక్కలను పోషిస్తున్నాడు.ప్రస్తుతం ఈ కుక్కలకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు వివరాల్లోకి వెళితే.అమెరికాలోని టెక్సాస్ కు చెందిన యూజిన్ బోస్టిక్ అనే 80 ఏళ్ల వృద్ధుడు మానవత్వానికి మారు పేరుగా నిలిచాడు.
కొన్ని రోజుల పాటు తమ ఇళ్లలో ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కలను పోషించలేక వాటిని తీసుకుని వచ్చి టెక్సాస్ లో గల యూజీన్ తోటలో వదిలేస్తున్నారు.
ఆ కుక్కలను గమనించిన యూజిన్ తన తోట దగ్గర అనాధలుగా వదిలేసిన ఆ కుక్కలన్నిటినీ చేరదీసి వాటి ఆలనా పాలన చూస్తూ అందరికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఆ కుక్కల కోసం ఒక టాయ్ ట్రైన్ కూడా తయారుచేశాడు యూజిన్.
"""/"/
కుక్కలకు ట్రైన్ ఏంటి అనుకుంటున్నారా.? అవి సరదాగా బయటకు షికారు వెళ్ళడానికి నీటిని నిల్వచేసుకునే కొన్ని డ్రమ్ములకు మధ్యలో రంద్రం పెట్టి, ఆ డ్రమ్ములకు కింద చక్రాలు అమర్చి వాటన్నింటినీ ఓ ట్రైన్ లాగా తయారు చేసాడు.
ఆ ట్రైన్ ను ఒక ట్రాక్టర్‌కు కట్టి, ఆ కుక్కలన్నిటినీ ఆ డ్రమ్ములలో ఎక్కించుకొని రోజూ అలా కాసేపు ఊళ్లో తిప్పుతూ ఉంటాడట.
ఆ కుక్కలకు కూడా అలా టాయ్ ట్రైన్‌లో తిరగడం అంటే భలే సరదా అంట.
"""/"/
యూజీన్ కి తోడుగా ఆయన సోదరుడు కోర్కీ కూడా సాయం చేస్తుంటాడు .
ఇలా యూజిన్ తన తోటలో వదిలేసిన డజన్ల కొద్దీ కుక్కల్ని పెంచుతూ ముగ జీవాల పాలిట దేవుడిలా మారాడు.
రెడ్జిట్ అనే సోషల్ మీడియా ఖాతలో ఈ వీడియో పోస్ట్ చేయబడింది.
ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.పెద్దాయన చేసిన ఈ మంచి పనిని అందరు మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఆ సినిమాకు మహేష్ బాబు జీరో రెమ్యునరేషన్.. రూట్ మార్చి మంచి పని చేశారా?