ప్రియుడిని రెండో పెళ్లి చేసుకున్న చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్.. ఫస్ట్ లవ్ బ్రేకప్ కావడంతో?
TeluguStop.com
టాలీవుడ్ హీరోయిన్ అమీ జాక్సన్( Amy Jackson ) గురించి మనందరికీ తెలిసిందే.
తాజాగా ఈమె వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.తన ప్రియుడు ఎడ్ వెస్ట్ విక్ ను( Ed Westwick ) ఆమె వివాహం చేసుకుంది.
ఇటలీలోని అమాల్ఫీ తీరంలో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది.వీరి వివాహనికి ఇరు కుటుంబసభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.
తమ పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది హీరోయిన్ అమీ జాక్సన్.
కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది అంటూ తన భర్తపై ప్రేమను కురిపించింది. """/" /
అయితే ప్రస్తుతం వీరి ఫోటోస్ నెట్టింట వైరల్ కావడంతో ఆ ఫోటోలను చూసిన అభిమానులు నెటిజన్స్ కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
గత కొంతకాలంగా ప్రేమలో మునిగితేలుతున్న ఈ జంట 2022లో డేటింగ్ స్టార్ట్ చేసి ఈనెల ఆగస్టు 25న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఈ ఏడాది జనవరి ప్రారంభంలో స్విట్జర్లాండ్ లోని జిస్టాడ్ లో అమీ జాక్సన్, ఎడ్ వెస్టివిక్ తమ ప్రేమబంధాన్ని బయటపెట్టారు.
ఇందుకు సంబంధించిన ఫోటోస్ అప్పట్లో తెగ వైరల్ అయ్యాయి.అలాగే కొద్ది రోజుల క్రితం స్నేహితులతో కలిసి ప్రీ వెడ్డింగ్ పార్టీ చేసుకున్నారు.
"""/" /
కొత్త జర్నీ ప్రారంభమయ్యిందంటూ ఇప్పుడు పెళ్లి ఫోటోలను షేర్ చేసింది.
కాగా అమీ జాక్సన్ గతంలో ఇంగ్లాండ్ కు చెందిన జార్జ్ పనియోటౌ( George Panayiotou ) అనే వ్యాపారత్తతో రిలేషన్ షిప్ లో ఉన్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా వీరిద్దరికి ఆండ్రూ అనే బాబు జన్మించాడు.2020లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు.
కానీ ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు.ఫస్ట్ లవ్ బ్రేకప్ కావడంతో ఇప్పుడు ప్రియుడిని రెండో పెళ్లి చేసుకొని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది.
ఈ కొత్త జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లు వెత్తుతున్నాయి.
సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ & రేటింగ్