Amy Jackson : ప్రియుడి ప్రేమను అంగీకరించిన రామ్ చరణ్ హీరోయిన్.. త్వరలోనే పెళ్లి?
TeluguStop.com
హీరోయిన్ అమీ జాక్సన్( Amy Jackson ).ఈ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చే సినిమా ఎవడు.
రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
తెలుగులో అభినేత్రి,ఎవడు సినిమాలలో మాత్రమే నటించింది.కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.
తమిళ హిందీ భాషల్లో ఎక్కువ సినిమాలలో నటించింది.ఈ సినిమాతో భారీగా పాపులారిటిని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఇది ఇలా ఉంటే ఈమె సినిమాల ద్వారా కంటే ఎక్కువగా తన పెళ్లి వార్తల ద్వారా సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది.
"""/"/
గతంలో కొన్నాళ్ల ఒక వ్యక్తితో డేటింగ్ చేసిన ఈ ముద్దుగుమ్మకు ఒక కొడుకు పుట్టాడు.
ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా అతడి నుంచి విడిపోయింది.ఆ తర్వాత బ్రిటీష్ నటుడితో ప్రేమలో పడింది.
గత కొన్నాళ్లుగా రిలేషన్‌లో ఉన్న ఈ జంట ఇప్పుడు ఒక్కటయ్యేందుకు రెడీ అయిపోయారు.
ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అమీ జాక్సన్.గతంలో జార్జ్ పనయాట్టు( George Panayiotou ) అనే వ్యక్తితో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమీ జాక్సన్ అతడితో ఒక కొడుక్కి జన్మనిచ్చింది.
ఏమైందో ఏమో గానీ అతడి నుంచి విడిపోయింది.ఇది జరిగిన తర్వాత కొన్నాళ్లకు విదేశీ నటుడు ఎడ్ వెస్ట్‌విక్( Ed Westwick )తో ప్రేమలో పడింది.
"""/"/
ఈ విషయం నేరుగా చెప్పనప్పటికీ కలిసి బయట కనిపించడంతో అందరూ కన్ఫర్మ్ చేసుకున్నారు.
తాజాగా స్విట్జర్లాండ్ లోని మంచు పర్వతాల్లో ఇతడు లవ్ ప్రపోజ్ చేశాడు.అమీ జాక్సన్ దీన్ని అంగీకరించింది.
ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్నాయి.
అయితే వీరిద్దరి పెళ్లి త్వరలో ఉండవచ్చు అని తెలుస్తోంది.ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
విషమంగానే శ్రీతేజ ఆరోగ్యం.. మనుషుల్ని సైతం బాలుడు గుర్తు పట్టడం లేదా?