తల్లి కాబోతున్నరోబో హీరోయిన్!
TeluguStop.com
బ్రిటన్ బ్యూటీ, స్టార్ హీరోయిన్, రోబో 2.ఓలో రజినీకాంత్ కి జోడీగా నటించిన భామ అమీ జాక్సన్.
ఈ భామ కొద్ది రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొని వివాహబంధంలోకి అడుగుపెట్టింది.
ఇక పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్న ఈ భామ హాలీవుడ్ లో సూపర్ విమెన్ గా ఓ టీవీ సిరిస్ లో నటిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ ఫోటో షేర్ చేసి తాను ప్రెగ్నెంట్ అనే విషయం స్పష్టం చేసింది.
అక్టోబర్ లో తన ఫ్యామిలీలోకి మరో వ్యక్తి రాబోతున్నాడు అంటూ అమీ పోస్ట్ చేసింది.
తెలుగులో రామ్ చరణ్ కి హీరోయిన్ గా నటించిన ఈ భామ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఐ మూవీతో ఒక్కసారిగా క్రేజీ సొంతం చేసుకుంది.
అలాగే రోబో సీక్వెల్ లో ఊహించని విధంగా ఆఫర్ ని ఈ భామ సొంతం చేసుకుంది.
ఇక సినిమాల కంటే బోల్డ్, రొమాంటిక్ ఫోటో షూట్ లతో ఎప్పుడు సందడి చేసే ఈ భామకి సోషల్ మీడియాలో విపరీతమైన ఫలోవర్స్ ఉన్నారు.
ఇక ఈ భామ తాను గర్భవతిని అనే విషయం చెప్పడంతో ఒక్కసారిగా ఆమె అందాలని ఆస్వాదించే అభిమానుల గుండెల్లో రాయి పడ్డట్లు అయ్యింది.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి28, మంగళవారం2024