బిగ్ బాస్ ఎంట్రీ పై స్పందించిన అమృత ప్రణయ్… ఒక్క మాటతో క్లారిటీ!

బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం త్వరలోనే ఎనిమిదవ సీజన్ ప్రారంభం కాబోతోంది.

అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇలా పలువురు పేర్లు కూడా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.ఇలా ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొనబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నటువంటి వారిలో అమృత ప్రణయ్ ( Amrutha Pranay ) కూడా ఒకరు.

అమృత ప్రణయ్ ఒక విషాద ఘటన ద్వారా అందరికీ సుపరిచితం అయ్యారు.అనంతరం ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా మరింత ఫేమస్ అయ్యారు.

ఈ క్రమంలోనే అమృత ప్రణయ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై అమృత ప్రణయ్ స్పందించారు. """/" / తాను బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నాను అంటూ వార్తలు వస్తున్నాయి.

ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు.ఇక ఈ వార్తలు విన్న తన తల్లి అలాగే అత్తయ్య నిజంగానే బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్తున్నావా అంటూ నన్ను ప్రశ్నిస్తున్నారని తెలిపారు.

తాను బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లలేదని ఈమె క్లారిటీ ఇచ్చారు.ఇక ఈ వీడియోలో భాగంగా చాలామంది తాను పొట్టి బట్టలు వేసుకున్నానని, నాన్ వెజ్ తింటున్నాను  అంటూ కూడా విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

"""/" / మేము బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వాళ్ళం అయినప్పటికీ చిన్నప్పటి నుంచి నాకు నాన్ వెజ్ తినే అలవాటు ఉందని, మా నాన్న కూడా తినేవారు కానీ మధ్యలో మానేశారు.

నాకు మాత్రం తెచ్చి పెట్టే వాళ్ళని అమృత ప్రణయ్ తెలిపారు.ఇక నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా స్టైలిష్ గా బట్టలు వేసుకుని దాన్ని అయితే మీరు నన్ను చిన్నప్పటినుంచి చూడలేదు ఒక విషాద ఘటన ద్వారా నేను మీకు పరిచయమయ్యాను.

నా వస్త్ర ధారణలో మార్పు మధ్యలో వచ్చింది కాదని చిన్నప్పటినుంచి కూడా నేను అలాగే పెరిగాను అంటూ ఈ సందర్భంగా ఈమె తన పట్ల వస్తున్న విమర్శలకి కూడా క్లారిటీ  ఇచ్చారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 4, బుధవారం 2024