టోల్ చార్జీల పేరుతో ఆర్టీసీ చార్జీల మోత

టోల్ చార్జీల పేరుతో ఆర్టీసీ చార్జీల మోత

సూర్యాపేట జిల్లా:కోదాడ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సులో టోల్ చార్జీ పేరుతో ఒక్కో ప్రయాణికుని వద్ద నుండి రూ.

టోల్ చార్జీల పేరుతో ఆర్టీసీ చార్జీల మోత

10 అదనంగా వసూల్ చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంఘటన గురువారం కోదాడ నుండి ఖమ్మం వెళ్తున్న బస్సులో జరిగి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

టోల్ చార్జీల పేరుతో ఆర్టీసీ చార్జీల మోత

ఓ ప్రయాణికుడు కోదాడ నుండి 12 కి.మీ దూరంలో ఉన్న చెరువు మదారం క్రాస్ రోడ్ స్టేజీ వరకు టికెట్ ఇవ్వమని అడిగాడు.

కండక్టర్ రూ.20 ఉన్న టికెట్ కు బదులుగా రూ.

30 టికెట్ ఇచ్చి రూ.30 తీసుకున్నారు.

ఇదేంటని అడిగితే టోల్ చార్జీ పెంచారని సమాధానం ఇచ్చారు.టిక్కెట్ మాత్రం అడిగిన స్టేజీకి కాకుండా మరో రెండు ఎక్కువ స్టేజీలకు 18 కి.

మీ దూరంలోని నేలకొండపల్లికి ఇచ్చారు.గతంలో ఉన్న టికెట్ కంటే అదనంగా రూ.

10 తీసుకోవడంతో ప్రయాణికులు అయోమయంలో పడ్డారు.టికెట్ పై టోల్ చార్జీ అని ముద్రించకుండా ఎలా వసూల్ చేస్తారని అడిగితే డిపో మేనేజర్ ను అడగండని చెప్పడం గమనార్హం.

బాధిత ప్రయాణికుడు మాట్లాడుతూ ఎలాంటి అధికార ముద్రణ లేకుండా టోల్ చార్జీ అంటూ నోటి మాటగా చెబుతూ ప్రయాణికులను ఆర్టీసీ యాజమాన్యం ఇష్టమొచ్చినట్లు చార్జీలు పెంచి ప్రయాణికులను దోచుకుంటుందన్నారు.

బస్ స్టాప్ ఉన్నప్పటికీ అడిగిన స్టేజికి కన్నా రెండు స్టేజీలు ఎక్కువ టికెట్ కొట్టి దానికి టోల్ పేరు చెప్పి ప్రయాణికులను దోచుకుంటున్నారని వాపోయాడు.

ప్రేమ, స్నేహం, బ్రేకప్‌ల ‘సమ్మేళనం’