ఎమ్మెల్సీల్లో బీసీలకు పెద్దపీట.. మంత్రి విడదల రజిని
TeluguStop.com
ఎమ్మెల్సీల్లో బీసీలకు పెద్దపీట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని మీడియా సమావేశం రాష్ట్రంలో ఈరోజు ప్రకటించిన 18 ఎమ్మెల్సీల అభ్యర్థుల జాబితాలో 11 మంది బీసీలకు పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
18 ఎమ్మెల్సీల్లో 11 బీసీలకు ఇవ్వడం ఒక చరిత్ర.బీసీలు అంటే జగనన్నకి ఎంత మక్కువ.
ఎమ్మెల్సీల్లో ఇచ్చినటువంటి 11 మంది అభ్యర్థ లే నిదర్శనం.రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మా జగనన్న.
ఎస్టీలకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన ఏకైక నాయకుడు మా జగనన్న.తెలుగుదేశం పార్టీ సమయంలో ఎమ్మెల్సీ అభ్యర్థులన్నీ 70% ఓసీలకు ఇచ్చారు.
కానీ మా జగనన్న ఇప్పటివరకు ఇచ్చిన ఎమ్మెల్సీ అభ్యర్థుల్లో దాదాపు 65% బీసీలకు పెద్దపీట వేశారు.
ఇంకా రాబోవు రోజుల్లో కూడా బీసీలకు మంచి మంచి పదవులు వచ్చే అవకాశాలు మా జగనన్న కల్పిస్తారు.
రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలకి ,బీసీలకి, ఎస్సీ ,ఎస్టీలకు ,ముస్లిం మైనార్టీలకు ప్రత్యేకమైన స్థానం కల్పిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మా జగనన్న.
సినిమాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పై స్పందించిన పవన్!