అమ్మనబోలు ప్రజల పోరాటపటిమ అజరామరం:నూనె వెంకట్ స్వామి
TeluguStop.com
నల్లగొండ జిల్లా: అమ్మనబోలు ప్రజల పోరాటపటిమ కారణంగానే నూతన మండలం సిద్ధించిందని ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి అన్నారు.
గురువారం ఆయన అమ్మనబోలులో మాట్లడుతూ ఎన్టీఆర్ కాలంలో 1985లో మండల వ్యవస్థ ఏర్పడిన నాడే అమ్మనబోలు మండలం ఏర్పడలేదని ప్రజలలో తీవ్రమైన అసంతృప్తి ఏర్పడిందని, నార్కట్పల్లికి అమ్మనబోలు 20 కిలోమీటర్ల దూరంలో ఉండి ప్రజలకు అసౌకర్యంగా మారిందన్నారు.
నిజాం కాలం నుండి అమ్మనబోలులో పెద్ద ఎత్తున అంగడి ఏర్పడడం వ్యాపార వాణిజ్యం పెరగడానికి కారణమైందన్నారు.
నార్కెట్పల్లి తర్వాత మండలంలో మేజర్ పంచాయతీగా ఉందని, ఇసుక మాఫియాను కట్టడి చేయాలంటే అమ్మనబోలులో పోలీస్ స్టేషన్ అత్యంత ఆవశ్యకంగా ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు.
పరిపాలన ప్రజల చేరువయ్యే దానికి అవకాశం ఉందని,2022 ఆగస్టు 1న కలెక్టరేట్ ముట్టడి అమ్మనబోలు( Ammanabolu ) పోరాటాన్ని మూలమలుపు తిప్పిందన్నారు.
సుమారు 14 పంచాయతీలు అమ్మనబోలు మండలం ఏర్పడాలని పెద్ద ఎత్తున పోరాడాయని,అందులో నా భూమిక కీలకమైనదని, ఈ పోరాటంలో నాతోపాటు కదిలిన ప్రజలందరికీ ప్రత్యేకమైనటువంటి జేజేలు తెలియజేస్తున్నానని తెలిపారు.
2009లో సిపిఎం తిరుగుబాటు అభ్యర్థిగా,2014లో 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన నేను ఓడిపోయానని,అయినా ఎప్పుడు కూడా అధైర్య పడలేదని,ప్రజలకు దూరంగా లేనన్నారు.
వంద కేసులు ఎదుర్కొన్నానని,రెండేళ్లు జైళ్లకు వెళ్లానని,అనేక లాఠీ దెబ్బలు తిన్నానని, అయినా ఎక్కడ అధైర్యడలేదు, మడమతిప్పలేదు,వెన్ను చూపలేదని,ప్రజల కోసం పోరాడానన్నారు.
ఆనాడైనా ఈనాడైనా ప్రజా ఉద్యమాలను ఉత్సాహంగా నడపడమే ధ్యేయంగా పెట్టుకున్నానని, అమ్మనబోలు మండలం ఏర్పడడంతో ప్రజా ఉద్యమాలకు మరింత ఉత్సాహం ఉత్తేజం ఉరకలెత్తుతున్నదని,ఈ పరిస్థితుల్లో మరింత ముందుకు వెళ్దామన్నారు.
2023 డిసెంబర్ ఎన్నికల్లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన మరుక్షణం అమ్మనబోలు మండలాన్ని వ్యాపార, వాణిజ్య,పారిశ్రామిక, వ్యవసాయక,విద్య,వైద్య కేంద్రంగా మలుస్తానని,మీ సహకారంతో మరింత ముందుకు సాగుతానని తెలియజేస్తున్నానన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిటిసి కొంపల్లి సైదులు, రైతు సేవాసమితి మండల అధ్యక్షుడు పజ్జురి నర్సిరెడ్డి,వార్డు మెంబర్లు, పిఎసిఎస్ డైరెక్టర్లు పాల్గొన్నారు.
పార్టీ నియోజకవర్గ అధ్యక్షులు దుర్గం జలంధర్,ఎన్నమల్ల పృథ్వీరాజ్,చిట్టిమల్ల శ్రవణ్ కుమార్ యోధ, ఎండమల్ల ప్రదీప్, ఎర్రమాధ శ్రీనివాస్ పటేల్, మద్దికుంట్ల భాస్కర్ ప్రజాపతి తదితరులు పాల్గొన్నారు.
ఇదేం దరిద్రం.. మిగిలిపోయిన ఇండియన్ ఫుడ్‌తో కేక్.. చెఫ్‌పై నెటిజన్లు ఆగ్రహం..