జీవితంలో రొమాన్స్ ఏ లేదు అంటూ కంటతడి పెట్టిన అమ్మ రాజశేఖర్ భార్య!

కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ గురించి మనందరికీ తెలిసిందే.అమ్మ రాజశేఖర్ ఎవరు అన్నది బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వక ముందు వరకు చాలా మందికి తెలియదు.

కానీ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అమ్మ రాజశేఖర్ అంటే ఇట్టే గుర్తు పట్టేస్తారు.

ప్రతి ఒక్కరు కూడా గుర్తు పట్టే విధంగా బిగ్ బాస్ అతనికి మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది.

బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు అమ్మరాజశేఖర్.ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు.

అదేవిధంగా డాన్స్ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించాడు.అదే బుల్లి తెర పై, వెండితెరపై అమ్మరాజశేఖర్ అందుకున్న విజయాల గురించి మనందరికీ తెలిసిందే.

ఇతను తన పర్సనల్ జీవితాన్ని ఎప్పుడూ కూడా గోప్యంగా ఉంచకుండా తెరచిన పుస్తకం గానే ఉంచాడు.

ఇక బిగ్ బాస్ షో ద్వారా తన ఫ్యామిలీ గురించి మరిన్ని విషయాలు తెలిపారు.

అదే విధంగా తాను ఒకానొక సమయంలో కెరీర్ పరంగా బిజీగా ఉంటూ తన ఫ్యామిలీకి ఎంత దూరంగా ఉన్నాడో కూడా చెప్పుకొచ్చాడు.

ఇకపోతే రాజశేఖర్ ఇప్పుడు తన భార్యతో కలిసి స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఇస్మార్ట్ జోడి సీజన్ 2 లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే.

వీరితో పాటుగా బుల్లి తెర పై నిత్యం ఎంటర్టైన్ చేసే కొన్ని జంటలు కూడా ఈ సీజన్ లో పాల్గొంటున్నారు.

ఇది ఇలా ఉంటే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే స్పెషల్ రాబోతుంది. """/" / ఈ సందర్భంగా ఒక స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

ఈ క్రమంలోనే జంటల మధ్య ఉన్న ప్రేమ బంధాన్ని వెలికితీసే ఒక టాస్క్ ని ఇచ్చాడు హోస్ట్ ఓంకార్.

ఈ నేపథ్యంలోనే అమ్మ రాజశేఖర్ భార్య ఎమోషనల్ అయ్యింది.ఈ షోలో భాగంగా భార్యలకు భర్తలు ప్రేమ లేఖలు రాయాలి అనే ఒక టాస్క్ ను ఇచ్చారు.

ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరు వారి భార్యలపై వారికి ఉన్న ప్రేమను చూపించారు.కొందరు అయితే వాళ్ల భార్యల పై ఉన్న ప్రేమను చాటుకునేందుకు కవిత్వాలు కూడా రాశారు.

ఇక ఈ సందర్భంగా రాజశేఖర్ భార్య నిజంగానే చేసింది. """/" / వాళ్ళ లైఫ్ లో ఇలా ప్రేమలు అనేవి లేవని, లైఫ్ అంతా కూడా సర్దుకుపోవడం తోనే సరి పోయిందని, వారి లైఫ్ అంతా కూడా త్యాగాలతో నిండిపోయిందని, ఇలా లవ్వులు గివ్వులు ఏం లేదు అని ఆమె తెలిపింది.

వాలెంటెన్స్ డే అంటే నేను కూడా అందరిలాగే చాలా ఊహించేదాన్ని.ఏదో ఒకటి ఇస్తారు చేస్తారు అని చూసేదాన్ని.

బెలూన్స్,కేక్స్, రొమాన్స్ అనేదే మా లైఫ్ లో లేదు అంటూ ఆమె ఎమోషనల్ అయ్యింది.

మరొకవైపు రాజశేఖర్ కూడా ఎమోషనల్ అయ్యాడు.అంతే కాకుండా ఆ ఎపిసోడ్ లో అమ్మ రాజశేఖర్ అందరిని నవ్వించే చేశాడు.

తన చేష్టలతో అందరి మీద పంచులు వేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేశాడు.ఇక ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు.

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హీరో రామ్ చరణ్ కెరీర్ లో ఆగిపోయిన 6 సినిమాలు ఇవే !