అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమం ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా: ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలకేంద్రంలో అమ్మ మాట -అంగన్వాడి బాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు.

ఈ సందర్భంగా అంగన్ వాడి టీచర్లు మాట్లాడుతూ అంగన్వాడి పాఠశాలల్లో కొత్త పాఠ్యప్రణాళిక రూపొందించడం జరిగిందని పిల్లలకు నాణ్యమైన చదువుతో పాటు ఆటలు పాటలు, కథలు, స్వేచ్ఛ, కలిపిస్తూన్నామని అలాగే ఉచిత భోజనం కూడా అందిస్తున్నామని అన్నారు.

అంగన్వాడి కేంద్రంలో మూడు నుంచి ఐదు సంవత్సరాల వయసు గల పిల్లల్లో మేధో వికాస అభివృద్ధి నైతిక అభివృద్ధి సామాజిక అభివృద్ధి వికసించే విధంగా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా బోధనా పద్ధతి రూపొందించామని అన్నారు.

ప్రైవేటు పాఠశాలకు దీటుగా అంగన్వాడీ కేంద్రంలో విద్య నేర్పించబడుతుందని తల్లులకు ఇంటింటికి వెళ్లి గృహ సందర్శన ద్వారా వారికి అవగాహన కల్పించడం జరిగిందని అన్నారు.

అంగన్వాడి సెంటర్లో కల్పిస్తున్న సేవలను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు రాజ్యలక్ష్మి, రజిత,భవాని తదితరులు ఉన్నారు.

సొంత అక్కకే పోటీగా నిలిచిన జయమాలిని.. జ్యోతిలక్ష్మి లాస్ట్ డేస్ ఎలా గడిచాయంటే..??