వారితో కలిసి కల్కి సినిమా చూడాలని ఉంది.. అశ్వర్థామా కామెంట్స్ వైరల్!

డైరెక్టర్ నాగ్ అశ్విన్ ( Nag Aswin ) దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ( Prabhas ) నటించిన తాజా చిత్రం కల్కి( Kalki ) ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏ విధమైనటువంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమా కేవలం సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ ఇండియాలో కూడా భారీ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతూ సంచలనాలను సృష్టిస్తుంది.

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ బాలీవుడ్ నటుడు అమితాబ్ తో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

"""/" / ఈ ఇంటర్వ్యూలో భాగంగా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తాజాగా ఈ ఇంటర్వ్యూ కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు.ఇందులో భాగంగా ఈ చిత్రంలో అశ్వత్థామ పాత్రలో నటించిన అమితాబ్ నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది.

అయితే ఈ విషయంపై అమితాబ్ మాట్లాడుతూ.కల్కి లో చేసినందుకు వస్తోన్న ప్రశంసలు నా నటనకు అనుకోవడం లేదు.

ఆ పాత్ర, కాన్సెప్ట్‌కు వస్తున్నాయి. """/" / ఇలాంటి ఒక గొప్ప ఐడియా వచ్చినందుకు మీకు ముందుగా కృతజ్ఞతలు తెలపాలి.

ఇక ఇందులో దీపిక పదుకొనే( Deepika Padukone ) పాత్ర చాలా అద్భుతంగా ఉంది.

ముఖ్యంగా ఆమె మంటల్లో నుంచి నడుచుకుంటూ వచ్చే సన్నివేశం హైలెట్ అని తెలిపారు.

ఈ సీన్ గురించి ప్రేక్షకుల స్పందన అడిగి తెలుసుకోవాలని ఉందని ఈయన తెలిపారు.

ఇకపోతే కల్కి సినిమాని తాను తెలుగు ప్రేక్షకులతో కలిసి చూడాలని ఉంది అంటూ ఈ సందర్భంగా అమితాబ్ చేసిన ఈ కామెంట్స్  వైరల్ అవుతున్నాయి.

తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని ఈయన తెలిపారు.

ఇక ఈ సినిమాలో అమితాబ్ తో పాటు  కమల్ హాసన్ వంటి వారు కీలక పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే.

డబుల్ ఇస్మార్ట్ మూవీ టీమ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారా..?