టీడీపీ మునుగుతుంది జనసేన కలుస్తుంది ! బీజేపీ ప్లాన్ ఇదేనా ?

ఒకరు మునిగితేనే మరొకరు ఎదుగుతారు అనే సూత్రం రాజకీయాల్లో బాగా పనిచేస్తుంది.తాము బలమైన పార్టీగా ఎదగాలంటే ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేయాలని నాయకులు భావిస్తూ ఉంటారు.

ఇదంతా రాజకీయల్లో సహజం. """/" /ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు బిజెపి పావులు కదుపుతోంది.

ముఖ్యంగా ఈ విషయంలో బిజెపి చీఫ్ అమిత్ షా ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.

దక్షిణాదిలో పట్టు పెంచుకునేందుకు కొంత కాలంగా ప్రయత్నిస్తున్న బిజెపి ఇప్పుడు ఏపీలో తమకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని భావిస్తోంది.

దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలని చూస్తోంది. """/" /బిజెపి ఇప్పటికిప్పుడు బలపడాలంటే అంత సులువైన విషయం ఏమీ కాదు.

అందుకే తెలుగుదేశాన్ని బలహీనం చేసే జనసేన ను బీజేపీలో విలీనం చేసే విధంగా పవన్ ఒప్పించేందుకు పావులు కదుపుతోంది.

ప్రస్తుతం టీడీపీ చాలా బలహీన స్థితిలో ఉంది.పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు లు తమ రాజకీయ భవిష్యత్తు ముందే ఊహించుకుని పార్టీ మారేందుకు ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో సుమారు పదిమంది వరకు టిడిపి ఎమ్మెల్యేలు బిజెపి లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు.

వారిని పార్టీలో చేర్చుకుని టిడిపిని పూర్తిగా కనుమరుగయ్యేలా చేయాలని బిజెపి చూస్తోంది.ప్రస్తుతం ఏపీలో జనసేన కు మంచి ఆదరణ ఉన్న క్షేత్రస్థాయిలో చాలా బలహీనంగా ఉంది.

పవన్ తప్ప ఆ పార్టీలో చెప్పుకోదగిన మరో నాయకుడు లేడు. """/" /అందుకే పవన్ దగ్గరగా చేసుకుని తమకు మద్దతుగా ఆ పార్టీని బీజేపీలో విలీనం చేసేలా ఒప్పించేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది.

ప్రస్తుతం ఏపీలో తమకు పేరు ఉన్నా బలం లేదనే విషయం పవన్ కి బాగా తెలుసు.

అందుకే తప్పకుండా బీజేపీ ప్రతిపాదనను పవన్ ఒప్పుకుంటాడు అనే నమ్మకం బీజేపీ అగ్రనేతలలో ఇప్పుడిప్పుడే కలుగుతోంది.

ఒకవేళ పవన్ ఆ ప్రతిపాదనకు ఒప్పుకుంటే బిజెపి సీఎం అభ్యర్థిగా పవన్ ప్రకటించేందుకు కూడా బిజెపి సిద్ధంగా ఉంది.

అయితే ఈ ప్రతిపాదనను పవన్ ఒప్పుకుంటాడా లేదా అనే విషయం తేలాల్సి ఉంది.

నెల్లూరు యువగళం సభలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!