వైరల్: వేసవిని తట్టుకోవడానికి తలపై ఫ్యాన్.. అమితాబ్ మెచ్చిన ఐడియా గురూ!

బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్( Amitab Bachhan ) గురించి ఇక్కడ ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు.

40 ఏళ్లకు పైగా హీరోగా , విభిన్న పాత్రలతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను ఆయన నేటికీ అలరిస్తూనే ఉన్నారు.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు బుల్లితెరపై హోస్ట్ గా రాణిస్తున్నారు.తరచుగా తన ఫ్యాన్స్ తో బ్లాగ్స్ ఇంటరాక్ట్ అవుతారు మన బిగ్ బి.

తాజాగా బిగ్ బీ అమితాబ్ తన సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేసి ఆ హెల్మెట్( Helmet ) ప్రత్యేకత గురించి రాస్తూ.

“ఇండియా ది మదర్ ఆఫ్ ఇన్వెన్షన్” అని క్యాప్షన్ తో అతని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

"""/" / దాంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.అయితే ఈ వీడియో చాలా పాతది అయినప్పటికీ మన బిగ్ బి కళ్ళల్లో పడడంతో మరలా న్యూస్ అయింది.

దీని గురించి మీరు ఇదివరకే చదివి వుంటారు.అయినా మరొకసారి గుర్తు చేసుకుందాం.

ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని గమనించినట్లయితే.వేసవిలో ఎండ వేడి( Summer Heat ) నుంచి రక్షణ ఇచ్చేందుకు హెల్మెట్ లాంటి ఒక ఫ్యాన్ తలకి ధరించాడొక వ్యక్తి.

ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని లఖీమపూర్ జిల్లాలోని చోటుచేసుకుంది.కాగా అతనిని అక్కడ స్థానికులు ధర్మేంద్ర బాబా అని పిలుస్తూ వుంటారు.

"""/" / కాగా ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉంది అని స్వయంగా మన అమితాబ్ బచ్చన్ చెప్పుకొచ్చారు.

దాంతో ఈ వీడియో మరలా లైక్స్, షేర్స్ తో సోషల్ మీడియాలో దుమ్ములేపోతోంది.

నెటిజన్లు అయితే దీనిని గురించి రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.భారతదేశాన్ని టెక్ గా మార్చే ఓ నూతన ఆవిష్కరణ ఇది అని కొందరు కొనియాడుతుంటే, పొదుపు కోసం తయారు చేసే రిసోర్స్‌ఫుల్ ఆవిష్కరణ అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

బీజింగ్‌లో గాంధీ జయంతి వేడుకలు.. భారీగా హాజరైన ప్రవాస భారతీయులు