Amitabh Bachchan : బన్నీ గొప్పదనం చెప్పిన అమితాబ్.. చెప్పు వదిలేసినా వైరలవ్వడం తొలిసారి అంటూ?

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా పుష్ప( Pushpa ) ఈ సినిమా 2021 లో విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది.

అంతేకాకుండా ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో నటనకు గాను ఉత్తమ నటుడిగా కూడా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్.

"""/" / ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ ( Allu Arjun )పుష్ప 2 సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇకపోతే తాజాగా ఈ సినిమాలోని పాట గురించి తాజాగా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan )ఎన్నో ఏళ్లుగా కౌన్ బనేగా కరోడ్‌పతి( Kaun Banega CrorepatI ) ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

"""/" / ప్రస్తుతం 15వ సీజన్‌ ప్రసారమవుతోంది.అయితే తాజా ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌కు సంబంధించిన ప్రశ్న వేశారు.

ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ.శ్రీవల్లీ పాటలో అల్లు అర్జున్‌ స్టెప్‌ గురించి కామెంట్స్ చేశారు.

పుష్ప నిజంగా అద్భుతమైన సినిమా.అందులో శ్రీవల్లీ పాట ప్రభంజనం సృష్టించింది.

చెప్పు వదిలేసినా.వైరల్‌ కావడం నా జీవితంలో మొదటిసారి చూశాను.

ఆ పాట వచ్చాక చాలా మంది అదే స్టెపును వేశారు.ప్రతి ఒక్కరూ వారి చెప్పులను వదిలేసి మళ్లీ వేసుకునే వారు అని నవ్వుతూ తెలిపారు అమితాబ్ బచ్చన్.

ఈ సందర్భంగా అమితాబ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆ కామెంట్స్ ని తెగ వైరల్ చేస్తున్నారు.

How Wild Robin Works For UK Mobile Players: Skill, Luck, And Geolocation Explained