దయచేసి అల్లు అర్జున్ తో నన్ను పోల్చవద్దు… బిగ్ షాక్ ఇచ్చిన అమితాబ్ బచ్చన్!
TeluguStop.com
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా అల్లు అర్జున్ (Allu Arjun) పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే.
ఈయన నటించిన పుష్ప 2(Pushpa 2) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఈ సినిమా సుమారు 1700 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది.
ఇలా ఈ సినిమా ద్వారా బన్నీ పేరు ఫ్రెండ్ అవుతుండగా మరోవైపు ఈ సినిమా విడుదలకు ముందు తొక్కిసలాట ఘటనలో భాగంగా అల్లు అర్జున్ అభిమాని మరణించడంతో ఆ కేసులో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ కావడంతో ఈయన ప్రస్తుతం వివాదంలో నిలిచారు.
"""/" /
ఈ క్రమంలోనే అల్లు అర్జున్(Allu Arjun) పట్ల ఎంతోమంది సెలబ్రిటీలు పరోక్షంగా విమర్శలు కూడా చేస్తున్న విషయం తెలిసినదే .
అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) సైతం అల్లు అర్జున్ గురించి ప్రస్తావన రావడంతో దయచేసి నన్ను ఆ హీరోతో పోల్చకండి అంటూ కామెంట్ చేశారు.
ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే.అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడ్ పతి (Kaun Banega Crorepati)అనే కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
"""/" /
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కంటెస్టెంట్ మాట్లాడుతూ తాను అల్లు అర్జున్ (Allu Arjun)అలాగే అమితాబ్ (Amitadh)గారికి పెద్ద అభిమాని అని తెలియజేశారు.
ఇలా సదరు కంటెస్టెంట్ మాట్లాడటంతో వెంటనే స్పందించిన అమితాబ్.అల్లు అర్జున్ ఎంతో అద్భుతమైన టాలెంట్ ఉన్నటువంటి గొప్ప నటుడు.
ఈ గుర్తింపుకు ఆయన అర్హుడు.తాను కూడా పుష్ప 2 (Pushpa 2)తో అల్లు అర్జున్ కి వీరాభిమానిగా మారిపోయాను దయచేసి అలాంటి ఒక గొప్ప నటుడితో నన్ను పోల్చవద్దు అంటూ అమితాబ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఎన్ఆర్ఐ పెట్టుబడులే లక్ష్యం .. భారీ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు మధ్యప్రదేశ్ సర్కార్ ఏర్పాట్లు