కల్కి సినిమాలో అమితాబ్ మొదటి హీరో.. నిర్మాత అశ్వనీదత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో టాలీవుడ్ హీరో ప్రభాస్( Prabhas ) దీపికా పదుకొనే కలిసిన నటించిన తాజా చిత్రం కల్కి.

( Kalki ) తాజాగా విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.

విడుదలైన తక్కువ సమయంలోనే రికార్డులు మూత మోగించడంతోపాటు దాదాపుగా 600 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.

ఇప్పటికీ ఈ సినిమా రికార్డుల మోత మోగిస్తూనే ఉంది.ఇకపోతే ఈ సినిమా కోట్ల బడ్జెట్ తో నిర్మించారని ఈ సినిమాకు దాదాపుగా 600 కోట్లకు పైగానే ఖర్చు అయ్యింది అంటూ రకరకాల వార్తలు వినిపించిన విషయం తెలిసిందే.

"""/" / తాజాగా ఈ వార్తలపై ఈ సినిమా నిర్మాత అశ్విని దత్( Ashwini Dutt ) స్వయంగా స్పందించారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.కల్కి సినిమా బడ్జెట్ 600 కోట్లు కాదు 700 కోట్లు అని ఆయన స్పష్టం చేశారు.

ఇంత భారీ బడ్జెట్‌ కు మేము ఎప్పుడూ భయపడలేదు.ఇక ఇప్పటివరకూ కల్కి సినిమా రూ.

700 కోట్లకు పైగా వసూళ్లు చేసింది.విడుదలైన వారం రోజుల్లోనే రూ.

700 కోట్లు కొల్లగొట్టి రూ.1000 కోట్ల దిశగా దూసుకుపోతోంది అని చెప్పుకొచ్చారు అశ్వనీ దత్.

"""/" / అదేవిధంగా కల్కి 2898 ఏడీ సినీమా బడ్జెట్‌ తో పాటుగా హీరో ప్రభాస్ తనతో చెప్పిన మాటలను కూడా నిర్మాత అశ్వినీ దత్ పంచుకున్నారు.

కల్కిలో అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) గారే మొదటి హీరో అని ప్రభాస్ తనతో అన్నారని అశ్వినీ దత్ తెలిపారు.

మనం అమితాబ్ గారిని గౌరవించాలని, అప్పుడే తాము గౌరవించబడతాం అని ప్రభాస్ చెప్పినట్లు తెలిపారు అశ్విని దత్.

అలాగే కమల్ హాసన్‌తో నటించాలన్న తన కల కూడా నెరవేరినట్లు రెబల్ స్టార్ తెలిపారని చెప్పుకొచ్చారు అశ్వని దత్.

ఆ సినిమాకు మహేష్ బాబు జీరో రెమ్యునరేషన్.. రూట్ మార్చి మంచి పని చేశారా?