ఓటీటీలో రిలీజ్ కాబోతున్న అమితాబచ్చన్ సినిమా
TeluguStop.com
లాక్ డౌన్ కారణంగా రిలీజ్ కాబోయే సినిమాలు అన్ని వాయిదా పడిపోయాయి.షూటింగ్ లు కూడా ఆగిపోయాయి.
దీంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలని రిలీజ్ కి రెడీ చేసుకొని ఎదురుచూస్తున్నారు.
అయితే థియేటర్లు ఎప్పుడు తిరిగి తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి నెలకొని ఉండటం వలన చాలా మంది నిర్మాతలు తమ సినిమాలని ఓటీటీలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
మొన్నటి వరకు చిన్న సినిమాలు మాత్రమే ఓటీటీ బాట పట్టగా ఇప్పుడు పెద్ద సినిమాలు కూడా ఇదే వరుసలోకి వచ్చి చేరాయి.
ఇప్పటికే సౌత్ నుంచి కీర్తి సురేష్ పెంగ్విన్ సినిమా ఓటీటీలో రిలీజ్ కాబోతుందనే టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే బాలీవుడ్ లో అమితాబచ్చన్ కీలక పాత్రలో నటించిన గులాబో సితాబో సినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ కావడానికి రెడీ అవుతుంది.
ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ సినిమా ప్రసిద్ధ దర్శకుడు సూజిత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కింది.
గతంలో ఉన్న షెడ్యూల్ ప్రకారం ఇది ఏప్రిల్ 12న విడుదల కావాల్సి ఉంది.
కానీ లాక్‌డౌన్ వల్ల, కరోనా అనిశ్చితి వల్ల పూర్వ స్థితి ఇప్పుడప్పుడే వచ్చే పరిస్థితి లేనందున డిజిటల్ రిలీజ్‌కు దర్శకుడు సూజిత్ రంగం సిద్ధం చేశాడు.
ఓటీటీ దిగ్గజం అమేజాన్ ప్రైమ్‌లో జూన్ 12వ తేదీన గులాబో సితాబో విడుదల కానుంది.
ఇందులో అమితాబ్ బచ్చన్ ఒక ముస్లిం ఇంటి యజమానిగా, ఆయుష్మాన్ ఖురానా అతని దగ్గర హిందూ కిరాయిదారుగా నటించారు.
కామెడీ ఎంటర్టైనర్ గా సోషల్ ఎలిమెంట్ తో ఈ సినిమా తెరకెక్కింది.మరి డిజిటల్ గా రిలీజ్ కి రెడీ అయిన ఈ సినిమా ప్రేక్షకులని ఎంత వరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.
ఆడవారు మొలకెత్తిన శనగలను తింటే ఏం అవుతుందో తెలుసా..?