హైదరాబాద్ లో అమిత్ షా మకాం ! ఇక మలుపులు తిరగనున్న రాజకీయం ? 

తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారంలోకి వచ్చి తీరాలనే పట్టుదలతో ఉన్న బిజెపి అధిష్టానం ఎప్పటికప్పుడు పార్టీ నాయకులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడంతో పాటు, తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఓడించేందుకు తెలంగాణలో బిజెపి జెండా ఎగురవేసేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ బిజెపి అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

ఈ మేరకు బిజెపి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జిగా అమిత్ షా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

దీని ప్రకారం ఎన్నికల వ్యూహాలకు రూపకల్పన చేయడంతో పాటు,  క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలు ఏ విధంగా చేయాలనే విషయం పైన అమిత్ దిశా నిర్దేశం చేయనున్నారు.

"""/" / దీనికోసం అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు ఆయన హైదరాబాదులోనే మకాం  వేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెంచే విధంగా ముందుకు వెళ్ళబోతున్నారట .

ముఖ్యంగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయలేమి ఉండడం, ఆధిపత్య పోరు, వీటన్నిటిని పర్యవేక్షించేందుకు అమిత్ షా చర్యలు చేపట్టబోతున్నారు .

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత, పూర్తిగా తెలంగాణపైనే దృష్టి పెట్టబోతున్నారు.మరో మూడు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

"""/" / అక్కడ అధికారంలోకి రావాలని బిజెపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.అయితే అక్కడ బిజెపిలో గ్రూపు రాజకీయాలు పెరగడం , నాయకులు మధ్య సమన్వయం లేకపోవడంతో,  పార్టీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడంతో,  అమిత్ షానే నేరుగా రంగంలోకి దిగారు.

అక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిలకనుగుణంగా రాజకీయ వ్యవహారాలను అమలు చేస్తున్నారు.కర్ణాటకలో ఇల్లు అద్దెకు తీసుకుని పూర్తిగా అక్కడ రాజకీయాలపైనే సమయం కేటాయించేందుకు అమిత్ షా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

అదేవిధంగా తెలంగాణలోనూ మకాం వేసి ఇక్కడ పరిస్థితులను చక్కదిద్ది తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ను ఓడించి,  తద్వారా జాతీయ రాజకీయాల్లోనూ కేసీఆర్ ప్రభావం లేకుండా చేయాలనే పట్టుదలతో బిజెపి అగ్రనాయకత్వం ఉంది.

బంగ్లాదేశ్‌లో జెట్ స్టంట్ విషాదాంతం.. వీడియో వైరల్..