ఆఫరేషన్ తెలంగాణ : కొత్త టీమ్ లను రంగంలోకి దించిన అమిత్ షా 

తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Union Home Minister Amit Shah ).

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి( BJP ) ఓటమి చెందడం, మూడో స్థానానికి పరిమితం కావడాన్ని సీరియస్ గా తీసుకున్న అమిత్ షా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే లక్ష్యం తో ముందుకు వెళుతున్నారు.

ఈ మేరకు తెలంగాణ బిజెపి నేతలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు.తెలంగాణలో డబల్ డిజిట్ స్థానాలను దక్కించుకునే వ్యూహం పై బిజెపి అగ్ర నేతలు ఫోకస్ చేశారు.

ఈ మేరకు ప్రత్యేకంగా కొన్ని టీమ్ లను ఏర్పాటు చేశారు.  ఈ టీమ్ తెలంగాణలో బిజెపి పరిస్థితి , అభ్యర్థుల గెలుపు అవకాశాలు,  ప్రత్యర్థి పార్టీల రాజకీయ వ్యవహారాలు తదితర అంశాలపై ఎప్పటికప్పుడు అమిత్ షాకు నివేదికలు పంపిస్తున్నాయి.

నాంపల్లి ( Nampally )లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఒక టీమ్ ను ఏర్పాటు చేశారు.

క్షేత్రస్థాయిలో మరో టీమ్ ను రంగంలోకి దించారు. """/" / ఈ టీమ్ లు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ప్రధాన కార్యాలయంలోని ఓ బృందం దీనిపై సమగ్రంగా ఒక నివేదికను తయారుచేసి అమిత్ షా కు పంపిస్తుంది.

ఈ రెండు బృందాలు పనిచేస్తున్నట్లు అభ్యర్థులకు కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేశారట.

ఈ నివేదన పరిశీలించి అభ్యర్థులకు ఎప్పటికప్పుడు కార్యాలయం నుంచి సూచనలు అందే విధంగా ఏర్పాటు చేశారు.

ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థుల కు చెక్ పెట్టే విధంగా ఏం చేయాలి ?  స్థానిక నేతల నుంచి సరైన సహకారం లభించకపోతే ఏ విధంగా ముందుకు వెళ్లాలి ?  రాజకీయ ప్రత్యర్థుల ఎత్తుగడలను ఏ విధంగా తిప్పుకొట్టాలి ఇలా అనేక అంశాలపై ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందించే విధంగా ఏర్పాటు చేశారు.

"""/" / ఇప్పటికే  రంగంలోకి దించిన ఈ  బృందాల పనితీరు మెరుగ్గా ఉందని , క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అయిందనే నివేదికలు కూడా అమిత్ షాకు అందాయట.

  దీంతో మరింత పగడ్బందీగానే ఈ టీమ్ ల సేవలను ఉపయోగించుకుని  తెలంగాణలో మెజార్టీ స్థానాలను దక్కించుకునే విధంగా వ్యవహారచన చేస్తున్నారు.

కెనడాలో ముగ్గురు భారతీయ విద్యార్ధుల హత్య .. రంగంలోకి విదేశాంగ శాఖ