ఈనెల 27న ఖమ్మం సభకు అమిత్ షా..!
TeluguStop.com
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఖమ్మంకు రానున్నారు.బీజేపీ ఈనెల 27న ఖమ్మంలో నిర్వహించనున్న సభలో అమిత్ షా పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు.
షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటేనని ఆరోపించారు.రెండు పార్టీలు కలిసేది ఖాయమని పేర్కొన్నారు.
అయితే ప్రజలు ఆ పార్టీలను నమ్మేస్థితిలో లేరని చెప్పారు.తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రభాస్ ఫౌజీ సినిమా షూటింగ్ ఎక్కడెక్కడ జరుగుతుందంటే..?