యముడు సినిమా నిజం చేసిన అమిత్ షా..

సూర్య నటించిన యముడు సిరీస్ బాగా హిట్ అయింది.అది మాకు తెలుసు మరి ఇప్పుడు దాని గురించి ఎందుకు అని మీరు నన్ను అడగొచ్చు అక్కడికే వస్తున్న ఆగండి.

యముడు3 సిరీస్ లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ అయిన సూర్య డిప్యుటేషన్ మీద సీబీఐ అధికారిగా ఒక కేస్ పనిమీద కర్ణాటకకి వెళ్తాడు ఇప్పుడు అలాంటి సీనే రియల్ లైఫ్ లో కూడా జరిగింది.

సుశాంత్ సింగ్ కేసు విచారణ నిమిత్తం ఈ మధ్య మహారాష్ట్రకు వెళ్లిన వినయ్ తివారీ అనే ఐపిఎస్ అధికారిని ముంబై పోలీసులు క్వారంటైన్ లో పెట్టి విచారణ జరగకుండా అడ్డుపడ్డారు.

దేశంలో పెద్ద వివాదస్పద అంశంగా మారిన సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిచ్చేలా ఉంది.

అంతేకాకుండా బీహార్ లో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ నమోదు చేసిన కేసు నిమిత్తం ముంబై చేరిన పోలీసులను విచారణకు ముంబై ప్రభుత్వం అనుమతించకపోవడంతో సీరియస్ అయిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.

ముంబై పోలీసులు క్వారంటైన్ లో ఉంచిన వినయ్ తివారీని డిప్యుటేషన్ మీద సీబీఐ అధికారిగా ముంబై పంపిస్తున్నారు.

"""/"/ ప్రస్తుతం సినిమాలో సీన్ ను అచ్చం దించేసిన అమిత్ షా అండ్ టీం నిర్ణయాన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

మరి ఇప్పుడైనా సుశాంత్ కేసులో దాగివున్న నిజాలు బయటకు వస్తాయో లేదో వేచి చూడాలి.

వీడియో: ఇన్‌స్టా రీల్స్‌ విషయంలో గొడవ.. రోడ్డు మీద కొట్టుకున్న యువతులు..