చక్రం తిప్పిన RSS.. బీజేపి అధ్యక్షుడిగా “అమిత్ షా” ఔట్..?

అమిత్ షా తీసుకుంటున్న నిర్ణయాలు.ఆయన ఒంటెద్దు పోకడలు దేశవ్యాప్తంగా బీజేపి పాలిత రాష్ట్రాలలో కాని అక్కడి నాయకులకి కానీ నచ్చడం లేదు.

మోడీ అమిత్ షా లు ఇద్దరు చేస్తున్న నిరంకుశత్వ విధానాలు తమ సొంత పార్టీ నేతలకి కూడా రుచించడం లేదట.

అయితే ఈ విధానాల వలనే పార్టీ వరుస వైఫల్యాలతో సతమతమవుతోంది.ఎన్నికల్లో వరుస ఓటములు మసకబారుతున్న పార్టీ ప్రతిష్ట, కర్ణాటకలో జరిగిన అవమానం, ఏకపక్షం గా వ్యవహరించి మిత్రులను దూరం చేసుకోవటం ఇలా ఎన్నో పరిణామాల వలన బీజేపి ఇంటా బయటా విలన్ లా తయారయ్యింది.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అంతేకాదు సీనియర్స్ ని తప్పించడం తదితర అంశాలపై RSS గుర్రు గా ఉందని గత కొద్దీ రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

అటు పాలన మీద పట్టు లేకుండా ఇటు రాజకీయ పరంగా వరుస ఎన్నికల్లో ఓడిపోతున్న నేపథ్యంలో RSS అమిత్ షా మీద ఆగ్రహం గా ఉందని, ఆయన్ని తప్పించి కొత్త ప్రెసిడెంట్ ని తీసుకోవాలనే ఆలోచనలో RSS తో పాటు కొందరు బిజెపి సీనియర్ నేతలు ఉన్నట్టు తెలుస్తుంది.

అంతేకాదు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే చాలా దెబ్బ తింటాం అని భావిస్తున్నారని ఆ కథనం సారాంశం.

!--nextpage అందుకే అమిత్ షా ని తప్పించి అందరిని కలుపుకుని పోయే నితిన్ గడ్కరీ లాంటి వారికి కానీ, లేదా దక్షిణ భారత దేశం నుంచి ప్రాతినిధ్యం ఇస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.

ఇదిలాఉంటే అమిత్ షా ని తప్పించడం ఆరెస్సెస్ వల్ల అయ్యే పని కాదని మోడీ అంత మద్దతు ఇచ్చే అమిత్ షా ని ఎలా తప్పిస్తారు అనే ప్రశ్నలుఉత్పన్నమవుతాయి అంటున్నారు.

చంద్రబాబు లాంటి వారిని దూరం చేసుకుని పెద్ద తప్పు చేసిందని ఈ ఫలితం కర్ణాటకలో తీవ్రమైన ప్రభావం చూపించింది.

మోడీ కి భయపడి ఎక్కువ మంది నోరు తెరవటంలేదు అనేది బిజెపి లో దాదాపు 40 మందికి పైగా ఎమ్మెల్యేలు మోడీ అండ్ షా ల ని వ్యతిరేకిస్తున్నారట.

అయితే ఈ విషయాన్ని ఇలాగే వదిలేస్తే తప్పకుండా బీజేపి సర్వ నాసరన్మ వుతుందని గ్రహించిన ఆరెస్సెస్ ఈ సమయంలో నాగపూర్ లో సమావేశం కాబోతున్నారట అయితే ఈ సమావేశంలో అమిత్ షా ని తప్పించటమే ప్రధాన అజెండాగా పెట్టుకున్నారట మరి ముందు ముందు ఆరెస్సెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

తన ఎలిగేటర్ తప్పిపోయిందట.. ఎంత కూల్‌గా చెబుతున్నాడో..?