అమిత్ షా వ్యూహం : ఏపీ బీజేపీ నేతలకు ఏం చెప్పారంటే ..?

ఏపీలో బీజేపీ పరిస్థితి ఏ విధంగా ఉందో అధిష్టానం పెద్దలకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు .

ఎప్పటి నుంచో ఏపీలో పాగా వేయాలని బిజెపి ప్రయత్నాలు చేస్తున్న,  అవేవి వర్కవుట్ కావడం లేదు .

గతంలో టిడిపితో పొత్తు పెట్టుకోవడం, సొంతంగా ఎదిగేందుకు పెద్దగా ప్రయత్నాలు చేయకపోవడం,  ఇలా ఎన్నో అంశాలతో ఇప్పటికీ బీజేపీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.

గతంలో తెలంగాణలో ఇదే రకమైన పరిస్థితి ఉండేది.కానీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అన్నంత స్థాయికి బిజెపి ఎడగగలిగింది.

ఇప్పుడు టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బిజెపి కనిపిస్తోంది.ఏపీలోనూ ఇదే రకమైన పరిస్థితి తీసుకు వద్దామని అధిష్టానం పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే ఏపీకి వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయంపై ఏపీ బీజేపీ నేతలకు హితబోధ చేశారు.

  ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీలో  మాట్లాడిన ఆయన అనేక అంశాలను ప్రస్తావించారు.

ఇకపై ఏపీ సొంతంగానే ఎదుగుదాము అని, ఈ విషయం పైన రాష్ట్ర నేతలంతా దృష్టి పెట్టాలని అమిత్ షా సూచించారు.

ప్రజా సమస్యల విషయంలో  నిరంతరం పోరాటాలు చేయడం ద్వారా మాత్రమే ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని, , ప్రజల్లో ఆదరణ పెరుగుతుందనే విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారు.

2024 ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి తీసుకువచ్చేలా పార్టీని బలోపేతం చేయాలని,  ఇతర పార్టీల నాయకులను పెద్ద ఎత్తున చేర్చుకుని మరింత బలంగా తయారవ్వాలని, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు పార్టీలో సరైన ప్రాధాన్యం ఇచ్చి వారిని మరింతగా ప్రోత్సహించాలని సూచించారు.

       ఇక ఇతర పార్టీలతో పొత్తు అంశాల గురించి ఎవరూ మాట్లాడవద్దని , దీనిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు మాత్రమే నిర్ణయం తీసుకుంటారని,  ఇకపై ఈ విషయంపై ఎవరు స్పందించి వద్దని సూచించారు .

ఈ సందర్భంగా గతంలో టిడిపితో పొత్తు ఎందుకు ఉండకూడదు అంటూ సుజనా చౌదరి,  సీఎం రమేష్  గతంలో వ్యాఖ్యానించడం, దీనికి కౌంటర్ గా ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ ధియోధర్ మాట్లాడడం వంటి వ్యవహారాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూనే , ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని మిగతా నేతలు ఎంత గౌరవించాలని, పార్టీని బలహీనపరిచే చర్యలను తాము ఎంత మాత్రం సహించబోమని హెచ్చరించారు.

అమిత్ షా సలహాలు సూచనలతో పార్టీ నాయకుల్లో కాస్త ఉత్సాహం  కనిపించింది.

రామ్ కు స్టార్ డమ్ తెచ్చిన సినిమాలను మర్చిపోతున్నాడా..?