టీబీజేపీ నేత‌ల‌కు బాగానే స‌ల‌హాలిస్తున్న అమిత్ షా..

టీబీజేపీ నేత‌ల‌కు బాగానే స‌ల‌హాలిస్తున్న అమిత్ షా

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు అంశం హాట్ టాపిక్ గా మారింది.

టీబీజేపీ నేత‌ల‌కు బాగానే స‌ల‌హాలిస్తున్న అమిత్ షా

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఇరుకున పెట్టేందుకు టీఆర్ఎస్, టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

టీబీజేపీ నేత‌ల‌కు బాగానే స‌ల‌హాలిస్తున్న అమిత్ షా

ఈ విమర్శలతో రాజకీయ కాక పెరుగుతోంది.ఇలా ఉన్న తరుణంలో తెలంగాణ లోని అగ్ర బీజేపీ నాయకులకు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది.

ఢిల్లీ నుంచి పిలుపు రాగానే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ ధర్మపురి అర్వింద్, మాజీ ఎంపీలు గరికపాటి, జితేందర్ రెడ్డి, విజయశాంతి, మాజీ మంత్రి డీకే అరుణ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి అమిత్ షాను కలిశారు.

వారికి అమిత్ షా పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.ఎన్నికలు ఏ సమయంలో వచ్చినా కానీ రెడీగా ఉండాలని, హుజురాబాద్ ఎన్నికల్లో ఎలాగైతే సమష్టిగా పోరాడి విజయం సొంతం చేసుకున్నారో అదే విధంగా సాధారణ ఎన్నికల్లో కూడా పోరాటం చేయాలని వారికి సూచించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాప్లో పడొద్దని బీజేపీ నేతలకు తెలిపారు.ఆయన తిమ్మిని బమ్మిని చేసే సత్తా ఉన్న నాయకుడని తెలిపారు.

తాను త్వరలో తెలంగాణ లో పర్యటిస్తానని చెప్పి బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగించారు.

"""/" / అయితే తాను ఎప్పుడు పర్యటిస్తానన్నది మాత్రం క్లారిటీగా చెప్పలేదు.ధాన్యం కొనుగోలు అంశంలో టీఆర్ఎస్ అవలంబిస్తున్న తీరును గురించి ప్రజలకు వివరించాలని అంతే కాకుండా టీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలను కూడా ప్రజలకు వివరించాలని ఆయన సూచించారు.

మీరు చేయాల్సింది మీరు చేయండి.ఎన్నికలపుడు కేంద్రం చేయాల్సింది కేంద్రం చేస్తుందని ఆయన టీ బీజేపీ ముఖ్య నేతలతో చర్చించినట్లుగా తెలుస్తోంది.

ఈ పరిణామంతో టీబీజేపీ నేతలు ఫుల్ ఖుషీలో ఉన్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి11, మంగళవారం 2025