అమిత్ షా పెద్ద అబద్దాల బాదుషా..: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత

బీజేపీ అగ్రనేత అమిత్ షాపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అమిత్ షా పెద్ద అబద్దాల బాదుషా అని తెలిపారు.మూసిన షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానంటున్నారన్న ఎమ్మెల్సీ కవిత దేశంలో పెద్ద పెద్ద పరిశ్రమలను మూసేశారు, కొన్ని అమ్మేశారని ఆరోపించారు.

ఎయిర్ ఇండియా అమ్మిన వాళ్లు షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామంటున్నారన్నారు.అయితే షుగర్ ఫ్యాక్టరీని ముంచిందే బీజేపీ ఎంపీ భోగరాజని ఆరోపించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

రేణు దేశాయ్ ఇంట్లో ప్రత్యేక పూజలు… సంతోషం వ్యక్తం చేసిన నటి!