అమిత్ షాకు మళ్లీ క‌రోనా టెస్ట్‌లు.. ఏం తేలిందంటే?

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇటీవ‌ల ప్రాణాంత‌క క‌రోనా వైర‌స్ బారిన‌ప‌డిన సంగ‌తి తెలిసిందే.

దీంతో ఆయ‌న‌కు గురుగ్రాంలోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స అందించారు.అనంత‌రం ప‌రీక్ష‌లు చేయ‌గా.

నెగ‌టివ్ వ‌చ్చింద‌ని స్వ‌యంగా అమిత్ షానే సోష‌ల్ మీడియా వేధిక‌గా తెలియ‌జేశారు.ఈ క్ర‌మంలోనే తన శ్రేయస్సు కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కూడా తెలిపారు అమిత్ షా.

ఇక గ‌త వార‌మే ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి.ఇంటికి చేరారు.

అయితే తాజాగా అమిత్ షా మంగళవారం నాడు ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరారు.

శ్వాస సంబంధమైన సమస్యలతో అమిత్ షా ఎయిమ్స్ లో చేరినట్టు కేంద్ర హోంమంత్రి కార్యాలయం మీడియా వ‌ర్గాల‌కు తెలిపింది.

క‌రోనా నుంచి కోలుకున్నా.అమిత్ షా శ్వాస కోశ సమస్యలతో పాటు ఒంటి నొప్పులతో బాధపడుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు మ‌ళ్లీ క‌రోనా సోకిందేమో అన్న అనుమానంతో.నేటి ఉద‌యం క‌రోనా టెస్ట్ చేశారు.

అయితే అందులో ఆయ‌న‌కు నెగ‌టివ్ వ‌చ్చింద‌ని ఎయిమ్స్ వర్గాలు వెల్లడించాయి.అలాగే ఆయ‌న ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదని.

ప్రస్తుతం ఒంటినొప్పులతోనే బాధపడుతున్నారని స్ప‌ష్టం చేశారు.అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఆయ‌న ఆసుపత్రి నుంచే ఆఫీసు వ్యవహారాలను చూసుకోనున్నారని తెలిపారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్30, సోమవారం 2024