గూగుల్‌పై చారిత్రాత్మక రూలింగ్.. తీర్పు చెప్పింది మన భారతీయుడే , ఎవరీ అమిత్ మెహతా..?
TeluguStop.com
టెక్ దిగ్గజం గూగుల్‌కు అమెరికా( America )లో చట్టపరంగా పెద్ద దెబ్బ తగిలింది.
డివైజ్‌లలో తనను తాను డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్, యాడ్ ప్రొవైడర్‌గా మార్చడానికి ప్రత్యేక ఒప్పందాలను ఉపయోగించిందని.
దాని ప్రత్యర్ధుల కంటే ఎక్కువ ప్రయోజనాన్ని అందించిందని న్యాయస్థానం తేల్చింది.తమ డివైజ్‌లలో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉండేందుకు యాపిల్ వంటి కంపెనీలకు గూగుల్ బిలియన్ డాలర్ల మేర చెల్లించినట్లు విచారణలో తేలింది.
కార్పోరేట్ రంగాన్ని కుదిపేస్తున్న ఈ కేసుపై తీర్పు చెప్పింది భారత సంతతికి చెందిన న్యాయమూర్తి అమిత్ మెహతా( Amit Mehta )దీంతో ఆయన గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.
"""/" /
గుజరాత్( Gujarat )లోని పటాన్‌లో జన్మించిన అమిత్ మెహతా ఏడాది వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు.
1993లో జార్జ్‌టౌన్ యూనివర్సిటీ( Georgetown University ) నుంచి పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్‌లో బీఏ డిగ్రీని పొందారు.
1997లో యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా స్కూల్ ఆఫ్ లా నుంచి జేడీ పట్టభద్రుడయ్యారు.
లా తర్వాత లాథమ్ అండ్ వాట్కిన్స్ ఎల్ఎల్‌పీలో పనిచేశారు.9వ సర్క్యూట్ యునైటెడ్ స్టేట్స్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ సుసాన్ పీ గ్రాబెర్‌కు క్లర్క్‌గా పనిచేశారు.
1999లో వాషింగ్టన్ డీసీలో జుకర్‌మాన్ స్పేడర్ ఎల్ఎల్‌పీలో చేరారు.2002 నుంచి 2007 వరకు కొలంబియా పబ్లిక్ డిఫెండర్ సర్వీస్ డిస్ట్రిక్ట్‌లో స్టాఫ్ అటార్నీగా చేరారు.
వైట్ కాలర్ క్రిమినల్ డిఫెన్స్, కాంప్లెక్స్ బిజినెస్ డీలింగ్స్, అప్పిలేట్ అడ్వొకసిలలో మెహతాకు అపార అనుభవం ఉంది.
"""/" /
మిడ్ అట్లాంటిక్ ఇన్నోసెన్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్ల బోర్డులో, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా బార్ క్రిమినల్ లా, వ్యక్తిగత హక్కుల విభాగం స్టీరింగ్ కమిటీకి కో చైర్‌గా ఉన్నారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలో డిసెంబర్ 22, 2014లో యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియాకు నియమితులయ్యారు.
2021 జనవరి 6 నాటి యూఎస్ క్యాపిటల్ అల్లర్లు సహా కీలకమైన కేసులపై ముఖ్యమైన తీర్పులు వెలువరించారు.
అల్లర్లను ప్రేరేపించడంపై దాఖలైన సివిల్ వ్యాజ్యాలను కొట్టివేయడానికి చేసిన ప్రయత్నాలను మెహతా ఖండించారు.
ఈ ఇయర్ లో మన స్టార్ హీరోలు సూపర్ సక్సెస్ లను అందుకుంటారా..?