ఫస్ట్ సినిమా పోస్ట‌ర్ల‌ను రోడ్ల మీద తిరిగి పంచి పెట్టి నేడు సూప‌ర్ స్టార్ గా ఎదిగాడు

శిల శిల్పంగా మారాలంటే ఉలి దెబ్బ‌లు ఎలా తినాలో మ‌నిషి ఉన్న‌త స్థానాల‌కు చేరాలంటే ఆటు పోట్లు ఎదుర్కోక త‌ప్ప‌దు.

ఇప్పుడు మంచి స్థితిలో ఉన్న‌వాళ్లంతా ఒక‌ప్పుడు జీవితంలో ఎదిగేందుకు అవ‌స్థ‌లు ప‌డ్డ‌వాళ్లే.అవ‌కాశాల కోస‌మే కాదు.

వ‌చ్చిన అవకాశాల‌నూ నిల‌బెట్టుకోవ‌డానికీ పోరాటం చేసిన వాళ్లే.అలా ఇబ్బందులు ప‌డి ఈ రోజు సూప‌ర్ స్టార్ గా ఎదిగిన వ్య‌క్తే కింది ఫోటోలో క‌నిపిస్తున్న మ‌నిషి.

త‌న తొలిసిమా విడుద‌ల సంద‌ర్బంగా చేతిలో క‌ర‌ప‌త్రాలు ప‌ట్టుకుని తిరుగుతున్న ఈ న‌టుడు ఎవ‌రు? ఆయ‌న రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నాడు? అనే విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం! ఈ పాంప్లెంట్స్ తో ప్ర‌చారం చేస్తున్న వ్య‌క్తి బాలీవుడ్ లో టాప్ హీరోగా కొన‌సాగుతున్న అమిర్ ఖాన్.

తండ్రి, బాబాయ్ ఇద్ద‌రూ సినిమా ప‌రిశ్ర‌మ‌కు చెందిన వ్య‌క్తులే కావ‌డంతో బాల న‌టుడిగానే సినిమాల్లోకి అడుగు పెట్టాడు.

చిన్న‌ప్పుడే యాదోం కి బార‌త్ అనే సినిమాలో న‌టించాడు.ఆ త‌ర్వాత చ‌దువుపై దృష్టి పెట్టాలి అనుకున్నాడు.

కానీ.ఇంట్లో ఆర్థిక సమ‌స్య‌లు పెరిగాయి.

పద‌వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఎలాగోలా చ‌దివాడు.నెమ్మ‌దిగా ఇంట‌ర్ పూర్తి చేశాడు.

తండ్రి తాహిర్ హుస్సేన్ ప్రొడ్యూస‌ర్, డైరెక్ట‌ర్.ఆయ‌న తీసిన సినిమాల‌న్నీ అప‌జ‌యాల బాట ప‌ట్టడంతో అప్పులు పెరిగాయి.

ఇంటి చుట్టూ అప్పుల వాళ్లు తిరిగే వాళ్లు. """/"/ అదే స‌మ‌యంలో అమిర్ ఖాన్.

స్నేహితుల‌తో క‌లిసి షార్ట్ ఫిల్మ్స్ తీసేవాడు.ఆ త‌ర్వాత నెమ్మ‌దిగా థియేట‌ర్ ఆర్ట్స్ వైపు వెళ్లాడు.

డైరెక్ష‌న్ రంగంలో శిక్ష‌ణ తీసుకున్నాడు.డైరెక్ట‌ర్, ప్రొడ్యూస‌ర్ అయిన పెద‌నాన్న నజీర్ ద‌గ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా చేరాడు.

రెండు సినిమాల‌కు అసిస్టెంట్ గా పనిచేశాడు.ఆ త‌ర్వాత అమిర్ ను హీరోగా పెట్టి సినిమా తీయాల‌నుకున్నాడు న‌జీర్.

"""/"/ అనుకున్న‌ట్లు గానే క‌యామ‌త్ సే క‌యామ‌త్ త‌క్ పేరుతో అమిర్, జూహిచావ్లా హీరో, హీరోయిన్లుగా సినిమా తీశారు.

ఆ సినిమా త‌న జీవితాన్ని మ‌లుపు తిప్పేది కావ‌డంతో అమిర్ స్వ‌యంగా ప్ర‌చారం చేశాడు.

సినిమా పోస్ట‌ర్లు పట్టుకుని తానే స్వ‌యంగా రోడ్ల మీద తిరుగుతూ పంచిపెట్టాడు.ఆటో వాళ్ల‌ను క‌ల‌సి త‌న మూవీ పోస్ట‌ర్ల‌ను వారి ఆటోల‌పై అంటించి త‌న‌కు స‌హ‌క‌రించాల్సిందిగా కోరాడు.

తండ్రి, పెద‌నాన్న ప్రొడ్యూస‌ర్స్ అయినా.త‌న తొలి సినిమా కోసం అమిర్ ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడు.

1988లో ఆ సినిమా విడుద‌ల అయ్యింది.బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది.

అమిర్ జీవితం మారింది.త‌న కుటుంబ అవ‌స్థ‌లు తీరాయి.

అమిర్ మిస్ట‌ర్ ఫ‌ర్ఫెక్ట్ గా ఎదిగాడు.ఎన్నో మంచి సినిమాలు చేసి సూప‌ర్ స్టార్ గా నిలిచాడు.

అమ్మ బాబోయ్.. ఉడత గాల్లో ఎగరడం ఎప్పుడైనా చూశారా.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్!