పెరిగిపోతున్న అమెరికా డిఫాల్ట్ సంక్షోభం.. 80 లక్షల ఉద్యోగాలకు ముప్పు?

ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్ధికవ్యవస్థ కలిగిన దేశం అమెరికా.( America ) అయితే ప్రస్తుతం అగ్రరాజ్యం అప్పుల ఊబిలో కూరుకుపోయింది.

అది చాలదన్నట్టు మరోపక్క డెట్ సీలింగ్( Debt Ceiling ) గురించి గంటల తరబడి చర్చలు నడుస్తున్న పరిస్థితి.

ఈ తరుణంలో అమెరికాకు చెందిన రేటింగ్ ఏజెన్సీ ఫిచ్, రుణ గడువు ముగుస్తున్నందున యూఎస్ రేటింగ్‌ను ప్రతికూల పరిశీలనలో ఉంచింది.

ఈ క్రమంలో అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించే సూచనలు మెండుగా కనబడుతున్నాయి.అయితే రాజకీయంగా ఏకాభిప్రాయం కుదిరిందని, రుణ సంక్షోభానికి త్వరలోనే తెరపడుతుందని ఫిచ్ ఆశాభావం వ్యక్తం చేయడం కొసమెరుపు.

"""/" / ఒకవేళ ఫిచ్ రేటింగ్‌ను తగ్గించినట్లయితే, అది ట్రెజరీ డెట్ సెక్యూరిటీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని భావిస్తోంది.

ఇక అమెరికా ప్రభుత్వం రుణ పరిమితిని పెంచాలనుకుంటోంది.యూఎస్ ప్రభుత్వ పాలసీలు, జీతాలు మొదలైన వాటికి సభ అనుమతితో రుణాలు తీసుకోవడం ద్వారా డబ్బు ఖర్చు చేస్తుంది.

అమెరికా అధ్యక్షుడు జో బిడెన్( President Joe Biden ) డెమొక్రాటిక్ పార్టీకి చెందినవాడు, పైగా రిపబ్లికన్ ప్రతిపక్ష సభ్యుడు కాబట్టి రుణ పరిమితిని పెంచడంలో ప్రతిష్టంభన పెరిగింది.

ఖర్చు తగ్గించుకోవడానికి బిడెన్ ప్రభుత్వం కొన్ని షరతులు పాటిస్తేనే రుణ పరిమితి ఆమోదం పొందుతుందని రిపబ్లికన్లు ముక్తకంఠంతో చెబుతున్న పరిస్థితి.

"""/" / ఒకవేళ రుణ పరిమితిని పెంచకపోతే అమెరికా డిఫాల్టర్‌గా మారే అవకాశం ఉందని అమెరికా ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయితే ఒకవేళ అమెరికా డిఫాల్ట్ అయితేమాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు కొన్ని ప్రభావితం కాకతప్పదు.

ఈ డిఫాల్ట్ చాలా కాలం పాటు కొనసాగితే.దాదాపు 80 లక్షల మంది ఉద్యోగాలు పోతాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు.

అదే సమయంలో స్టాక్ మార్కెట్ పతనమై ఇన్వెస్టర్లు 10 ట్రిలియన్ డాలర్ల వరకు నష్టపోవచ్చని తెలుస్తోంది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడి కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఇపుడు ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

వైరల్ వీడియో: ఓరి దేవుడా.. ఇంటి పైకప్పులో వింత శబ్దాలు.. ఏముందా అనిచూస్తే షాకే..