అమెరికన్స్ కి ట్రంప్ కీలక ఆదేశాలు…????

అమెరికాలో కరోనా సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు.వేలాది మంది కరోనా బారిన పడి మృతి చెందుతున్నారు, లక్షలాది మంది ప్రజలకి కరోనా పాజిటివ్ అని తేలింది.

దాంతో దిక్కు తోచని స్థితిలో అమెరికా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలాఉంటే అమెరికా వ్యాప్తంగా అన్ని కార్యకలాపాలు మూసివేయబడ్డాయి.

షాపింగ్ మాల్స్, నిత్యవసర వస్తువులు దొరకక అమెరికన్స్ వలస దారులు అందరూ అల్లాడి పోతున్నారు.

ఇదిలాఉంటే.అమెరికా పౌరులు విదేశాలలో ఎక్కడ ఉన్నా సరే వచ్చేయండి అంటూ ట్రంప్ అమెరికన్స్ కి పిలుపునిచ్చారు.

ప్రపంచ దేశాల్లో ఉండే అమెరికన్స్ అందరూ వచ్చేయండి అంటూ ట్రంప్ సర్కార్ కీలక ప్రకటన చేసింది.

మీరు సొంత దేశానికి వచ్చేయాలని అనుకుంటే నిమిషం కూడా ఆలస్యం చేయద్దు వచ్చేయండి అగ్ర రాజ్యానికి వచ్చే అన్ని రకాల విమానయాన సర్వీసులు త్వరలో రద్దు చేసే పరిస్థితి రావచ్చు అంటూ ప్రకటించారు.

అమెరికన్స్ కోసం కొన్ని దేశాలకి ప్రత్యేకంగా విమానాలు పంపినా వారికి వచ్చే పరిస్థితి ఉండే లేదో కూడా తెలియదు.

ఎవరెవరు అమెరికాకి వచ్చేయాలని అనుకుంటున్నారో వారందరూ వచ్చేయండి.మీరు మీ దగ్గరలో ఉన్న అమెరికన్ ఎంబసీకి మీ వివరాలు చెప్పండి అంటూ అమెరికా సెక్రెటరీ ప్రకటించారు.

ఒక చిన్న ల‌వంగాన్ని ఎన్ని విధాలుగా వాడొచ్చో తెలుసా..?