Juan Gonzalez Apple Vision Pro : అపరిచితులకు కేవలం రూ.80కే యాపిల్ విజన్ ప్రో అందించిన యూట్యూబర్..

యాపిల్ విజన్ ప్రో( Apple Vision Pro ) కేవలం ఒక టెక్ డివైజ్‌కు మించి ఒక అద్భుతంగా అవతరించింది.

ఇది ఇప్పుడు స్టైల్, మోడర్న్ లివింగ్‌కి సింబల్‌గా మారింది.ప్రజలు ఈ కొత్త ట్రెండ్‌ని పూర్తిగా స్వీకరిస్తూ ప్రతిచోటా ప్రదర్శిస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘దట్ వాస్ ఎపిక్’( That Was Epic ) ఛానెల్‌కు చెందిన యూట్యూబర్ జువాన్ గొంజాలెజ్( Juan Gonzalez ) అత్యంత ఖరీదైన యాపిల్ విజన్ ప్రోలను బహుమతులుగా అందించడం ప్రారంభించారు.

అతను సాధారణంగా 3,500 డాలర్లు (సుమారు రూ.2.

8 లక్షలు) ఖరీదు చేసే యాపిల్ విజన్ ప్రోని కేవలం 1 డాలర్ (సుమారు రూ.

80)కి అందిస్తున్నాడు.నమ్మడానికి చాలా కష్టంగా అనిపించినా ఇది అక్షర సత్యం.

ఈ అధునాతన VR హెడ్‌సెట్లను ఫ్రీ ట్రీట్‌లుగా ఇస్తున్నాడు.జువాన్ వీధిలో కనిపించిన వ్యక్తులను డాలర్ లేదా సన్ గ్లాసెస్ వంటి చిన్న వస్తువులను తార అని అడుగుతున్నాడు.

అలా ఇచ్చిన వారికి తాను యాపిల్ విజన్ ప్రోని అందించి సర్‌ప్రైజ్ చేస్తున్నాడు.

వారిచ్చిన సన్ గ్లాసెస్, డాలర్లను కూడా తిరిగి ఇచ్చేస్తున్నాడు.తన వద్ద ఉన్న డబ్బును సమాజానికి తిరిగి ఇచ్చేయాలని అతడి గొప్ప మనసుకు నెటిజనులు ఫిదా అవుతున్నారు.

ఈ లింకు Https://youtu!--be/ijphDB1u0u0?si=ABDcZErSnRTY2xD9పై క్లిక్ చేయడం ద్వారా వైరల్ వీడియోను మీరు కూడా చూడవచ్చు.

"""/" / జువాన్ పెన్ను వంటి సాధారణ వస్తువుల కోసం లేదా అతనితో జస్ట్ మాట్లాడనందుకే అపరిచితులకు( Strangers ) 500 డాలర్లు (సుమారు రూ.

41,000) ఆఫర్ చేసి ఆశ్చర్యపరిచాడు.ఒక అమ్మాయి వాటర్ బాటిల్‌ను ఇచ్చినందుకు ఆమెకు అక్షరాలా 500 డాలర్లు ఇచ్చి వావ్ అనిపించాడు.

ఆమె డబ్బును స్వయంగా తనిఖీ చేసే వరకు నమ్మలేకపోయింది.జువాన్ వీధిలో కనిపించిన చాలామందిని ఇలానే కలుసుకుంటూ వారికి డబ్బులు ఇస్తూ ఆశ్చర్యపరుస్తుంటాడు.

"""/" / జువాన్ 2021లో ఏప్రిల్ ఫూల్స్ డే తర్వాత, యాపిల్ వాచ్‌లను( Apple Watches ) బహుమతిగా ఇచ్చాడు.

అతను మొదట నకిలీ వాచ్‌తో ప్రజలను మోసగించాడు, ఆపై నిజమైన దానితో వారిని ఆశ్చర్యపరిచాడు.

దానాలు ఇవ్వడంలో జువాన్ ప్రత్యేకమైన విధానం అతన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది.

కిరాక్ షో ద్వారా బుల్లితెర పైకి రీ ఎంట్రీ ఇవ్వనున్న అనసూయ?