అమెరికాలో కార్మికుల సమ్మె..ఎందుకంటే...!!!

అమెరికాలో ఉన్న ఆటోమొబైల్ కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మెకి పులుపు ఇచ్చారు.ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ జనరల్ మోటార్స్ కి చెందిన ఈ కార్మికులు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది.

గతంలో అంటే 2007 లో వేతనాల విషయంలో సమ్మె చేపట్టిన వీరు మళ్ళీ ఇన్నేళ్ళ తరువాత ఇప్పుడు సమ్మెకి పులుపు ఇవ్వడంతో సదరు సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

"""/"/  వేతనాలు,ఇతరాత్రా విషయాలలో కార్మికులకి కంపెనీకి ఏర్పడిన భేదాభిప్రాయాల కారణంగా దాదాపు 49 వేల మంది కార్మికులు సమ్మెలోకి దిగారు.

విధులని బహిష్కరణ చేసిన కార్మికులు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు అందరూ విధుల నుంచీ బయటకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

"""/"/  ఈ పరిణామాలతో ఒక్క సారిగా అమెరికా వ్యాప్తంగా ఉన్న సుమారు 9 రాష్ట్రాలలో నెలకొని ఉన్న 33 ఉత్పత్తి కేంద్రాలలో పంపిణీ పనులు పూర్తిగా ఆగిపోయాయి.

వేతనాలు, ఆరోగ్య సంరక్షణ ఉద్యోగ భద్రతపై కార్మికులు సంస్థకి చేసుకున్న ఒప్పందం పూర్తి అయ్యింది.

అయితే తాజా ఒప్పందం సఫలం కాకపోవడంతో కార్మికులు సమ్మె బాట పట్టినట్టుగా తెలుస్తోంది.

పాయల్ లాంటి హీరోయిన్ మాట సరే.. మరి నయన్ లాంటి స్టార్స్ కి రూల్స్ లేవా ?