అమెరికా పోలీసు..ఆరేళ్ళ పిల్లాడు..స్టొరీ అదుర్స్..!!!

చిన్నపిల్లలకి అభం శుభం తెలియదు, కల్లా కపటం లేని మనసు వారిది.అందుకే నచ్చినట్టుగా ఉంటారు.

కావాల్సింది ఏడ్చి మరీ సాధించుకుంటారు.ఇలాంటి సంఘటన అమెరికాలో జరిగింది.

ఓ పిల్లాడు చేసిన ఓ చిన్న సంఘటనతో అమెరికాలో ఓ పోలీస్ అధికారి ఫిదా అయ్యి, ఆ పిల్లాడిని తన కారులో ఎక్కించుకుని ఊరంతా తిప్పాడు, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

దాంతో ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆ పోలీసు అధికారి భాద్యతకి సలాం కొడుతున్నారు.

వివరాలలోకి వెళ్తే.అమెరికాలోని ఫ్లోరిడాలో ఆరేళ్ల పిల్లాడు తనతో ఎవరూ ఆడుకోవడం లేదని, తానూ ఒంటరిగా ఉన్నానని, అమెరికా పోలీసుల టోల్ ఫ్రీ నెంబర్ 911కు ఫోన్ చేసి చెప్పాడు.

అక్కడితో ఆగకుండా తనతో ఆడుకోవడానికి మంచి స్నేహితుడు కూడా కావాలని అడిగాడు.దాంతో ఓ పోలీసు అధికారి ఆ పిల్లాడు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు.

నీతో ఆడుకోవడానికి, నీకు స్నేహితుడుగా ఉండటానికి నేను ఉన్నాను అంటూ బదులిచ్చాడు.అక్కడితో ఆగకుండా ఆ పిల్లాడిని ఊరంతా కారులో తిప్పి, అతడికి ఓ కుల్ల పిల్లని బహుమతిగా ఇచ్చాడు.

ఈ క్రమంలోనే 911 కి ఎటువంటి పరిస్థితిలో ఫోన్ చేయాలో వివరిచాడు.అయితే ఇంతకీ ఆ పిల్లాడికి ఇద్దరు సోదరులు కూడా ఉన్నారని, తన తల్లి సోదరులతో గొడవపడి 911 కి కాల్ చేశాడని ఆ అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.

ఆ పోలీసు అధికారిని ప్రపంచ వ్యాప్తంగా అందరూ ప్రశంసించడం మొదలు పెట్టారు.అతడు సూపర్ పోలీస్ అయ్యాడని కొనియాడుతున్నారు.

కోవిడ్ -19 వ్యాక్సిన్ ఉపసంహరణ.. ఆస్ట్రాజెనెకా సంస్థ ప్రకటన