అమెరికా ప్రజలు ట్రంప్ కి ఓటు వెయ్యరట..!!!

వచ్చే ఎన్నికల్లో ట్రంప్ కి అమెరికా ప్రజలు ఓటు వేస్తారా లేదా అని ప్రశ్నిస్తే దాదాపు 53 శాతం మంది మేము చస్తే ట్రంప్ కి ఓటెయ్యం అని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పారట.

క్వినిపియాస్‌ యూనివర్శిటీ నిర్వహించిన సరికొత్త సర్వే లో ఈ విషయం వెల్లడైంది.సర్వే చేసిన వారిలో 30శాతం మంది మాత్రమే ట్రంప్‌కు ఓటు వేస్తామని చెప్పారని మిగిలిన వారిలో 13 శాతం మంది ప్రజలు ఆయనకు ఓటు వేయాలా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారని.

ఖచ్చితంగా ట్రంప్ కి మద్దతు ఇస్తామని చెప్పిన వారిలో రిపబ్లికన్ పార్టీకి చెందిన వారు 77శాతం మంది కాగా, 21శాతం మంది ఇతరులు ఉన్నారని .

ఒక శాతం మంది డెమోక్రాట్లు వున్నారని తెలిపారు.అయితే ఈ సర్వేని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ ప్రచారంలో రష్యా జోక్యంపై రెండేళ్ళు పాటు దర్యాప్తు సాగించిన తుది నివేదిక వచ్చిన తరువాత నిర్వహించారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే అధ్యక్షుడు ట్రంప్ ఎటువంటి తప్పు చేయలేదని బార్ అయన టీం చెప్పడంతో ట్రంప్ ఆయన మిత్రులు సంబారాలు చేసుకున్నారు.

ముల్లార్‌ కూడా గౌరవప్రదంగా వ్యవహరించారని ట్రంప్ అన్నారు.అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమిటంటే దర్యాప్తు తరువాత చేసిన ఈ సర్వేలో ట్రంప్ కి అమెరికా ప్రజలు మద్దతు ఇవ్వకపోవడం పెద్ద షాక్ ఇస్తోంది.

విడాకుల గురించి సలహా అడిగిన యువతి.. చిరంజీవి కూతురు రియాక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!